Cheteshwar Pujara : సెల‌క్ట‌ర్ల‌కు పుజారా స్ట్రాంగ్ మెసేజ్‌..! ఇక ఎంపిక చేయ‌క త‌ప్ప‌దు..!

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ఛ‌తేశ్వ‌ర్ పుజారా దేశ‌వాలీ క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్నాడు.

Cheteshwar Pujara

Pujara : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ఛ‌తేశ్వ‌ర్ పుజారా దేశ‌వాలీ క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్నాడు. జార్ఖండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సెంచ‌రీతో రాణించాడు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 25 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో త‌న‌కు చోటు క‌ల్పించాల్పిందేన‌ని సెల‌క్ట‌ర్ల‌కు త‌న బ్యాట్‌తోనే స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు.

రంజీట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదిక‌గా సౌరాష్ట్ర‌, జార్ఖండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 142 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర రెండో రోజు టీ విరామానికి త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 338 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ఛ‌తేశ్వ‌ర్ పుజారా 162 బంతుల్లో శ‌త‌కం బాదాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజ‌రాకు ఇది 61వ శ‌త‌కం కావ‌డం విశేషం.

T20 World Cup 2024 : అంతా మీ ఇష్ట‌మేనా..? మాకు రోహిత్ శ‌ర్మ‌నే కావాలి.. మీరు మార్చాల్సిందే.. నెటిజ‌న్ల గ‌రం గ‌రం

పేల‌మ ఫామ్‌తో చోటు కోల్పోయి..

ఛ‌తేశ్వ‌ర్ పుజారా గ‌త రెండేళ్లుగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. 2021-22 ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌టన నుంచి త‌న స్థాయికి త‌గ్గ ఇన్నింగ్స్‌లు ఆడ‌డం లేదు. ఈ క్ర‌మంలో 2022లో శ్రీలంకతో జ‌రిగిన టెస్టు సిరీస్‌కు అత‌డికి జ‌ట్టులో స్థానం ల‌భించ‌లేదు. అయితే.. దేశీవాలీ క్రికెట్‌లో స‌త్తా చాట‌డంతో ఓవ‌ల్ వేదిక‌గా 2023లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఈ మ్యాచులోనూ విఫ‌లం కావ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయాడు.

ఈ క్ర‌మంలో వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు అత‌డిని సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న బెట్టారు. య‌శ‌స్వి జైస్వాల్ , శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ వంటి ఆట‌గాళ్ల‌ను ఈ రెండు సిరీస్‌ల‌కు ఎంపిక చేశారు. అయితే.. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఈ ముగ్గురు విఫ‌లం అయ్యారు. ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-2025 సైకిల్‌లో ఫైన‌ల్ చేరుకోవాలంటే ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ భార‌త్‌కు ఎంతో కీల‌కం.

WTC Rankings : భార‌త్‌కు ఆస్ట్రేలియా గండం.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో టీమ్ఇండియాను వెన‌క్కినెట్టిన ఆసీస్‌

దీంతో సీనియ‌ర్లు పుజ‌రా, ర‌హానేల‌ను ఎంపిక చేయాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో పుజారా ఫామ్ అందుకుని సెంచ‌రీ సాధించి తాను రేసులో ఉన్నాన‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. పుజారా ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేసి జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా.. టీమ్ఇండియా త‌రుపున పుజారా 103 టెస్టులు ఆడాడు. 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలతో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు