Ajit Agarkar on Shreyas Iyer : ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?.. అగార్కర్ ఆన్సర్ ఇదీ..

శ్రేయ‌స్ అయ్య‌ర్ కు జ‌ట్టులో ఎందుకు చోటు ద‌క్క‌లేదు అనే విష‌యాన్ని చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ (Ajit Agarkar )వెల్ల‌డించాడు.

chief selector Ajit Agarkar Explains Shreyas Iyer Asia Cup 2025 Snub

Ajit Agarkar  : ఆసియాక‌ప్ 2025 కోసం 15 మందితో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ నాయ‌క‌త్వంలోనే భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. దాదాపు ఏడాది త‌రువాత శుభ్‌మ‌న్ గిల్ టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. అత‌డిని వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. గిల్ చివ‌రిసారిగా 2024లో ప‌ల్లెక‌లె వేదిక‌గా శ్రీలంక‌తో టీ20 మ్యాచ్ ఆడాడు.

కాగా.. ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్‌కు మాత్రం జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. అత‌డితో పాటు ఐపీఎల్‌లో పాటు దేశ‌వాళీ క్రికెట్‌లో రాణించిన మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు సైతం నిరాశే ఎదురైంది. వీరిద్ద‌రికి జ‌ట్టులో ఎందుకు చోటు ద‌క్క‌లేదు అనే విష‌యాన్ని చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ (Ajit Agarkar )వెల్ల‌డించాడు.

Asia Cup 2025 Team India Squad : ఆసియా కప్‌ 2025కు భార‌త జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌గా సూర్య‌.. వైస్ కెప్టెన్‌గా గిల్‌, శ్రేయ‌స్‌కు నో ప్లేస్‌..

అభిషేక్ శ‌ర్మ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో పాటు అత‌డు బౌలింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. ఈ క్ర‌మంలోనే య‌శ‌స్వి జైస్వాల్‌కు స్థానం ల‌భించ‌లేదు. ఇది దుర‌దృష్ట‌క‌రం అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్ విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింద‌న్నాడు. ఇందులో అయ్య‌ర్ త‌ప్పేమీ లేద‌న్నాడు. ఎవ‌రి స్థానంలో అత‌డిని తీసుకోవాలో అర్థం కాలేద‌న్నాడు.

PCB : బాబ‌ర్ ఆజామ్‌, రిజ్వాన్‌ల‌కు పీసీబీ మ‌రో షాక్‌.. మొన్న టీ20 జ‌ట్టు నుంచి తొల‌గిస్తే.. నేడు ఏకంగా..

ఆసియా క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టు ఇదే..
సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.