MS Dhoni : మెంటర్ గా ధోనీ..బీసీసీఐకి ఫిర్యాదు అందిందా ? ఎందుకు ?

ఎంఎస్‌ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.

T20 World Cup 2021 : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గా పిలుచుకొనే మహేంద్ర సింగ్ ధోనీ సేవలను వినియోగించుకోవాలని మేనేజ్ మెంట్ భావించింది. అందులో భాగంగా…2021 టీ20 ప్రపంచకప్‌ కొట్టాలనే ప్రణాళికలో భాగంగా ఎంఎస్‌ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.

Read More : MS Dhoni: ధోనీ మెంటార్‌గా అందుకే అవసరం

లోధా కమిటీ సంస్కసరణల్లో ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్లాజ్ కింద రెండు పదవులను ఓ వ్యక్తి చేపట్టకూడదని వెల్లడిస్తున్నారు. ధోనీ..ఐపీఎల్ (IPL) టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. ఇదే విషయాన్ని సంజీవ్ గుప్తా ప్రస్తావిస్తున్నారు. బీసీసీఐ రాజ్యాంగంలోని క్లాజ్ 38 (4) ప్రకారం ఇది విరుద్ధమని అందులో వెల్లడిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ తమ లీగల్ టీమ్ ను సంప్రదించాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

Read More : T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. మెంటర్‌గా ధోనీ

టీ20 వరల్డ్ కప్ కు వెళ్లే టీమిండియా జట్టులో యువరక్తంతో నిండి ఉండాలని బీసీసీఐ భావించింది. జట్టులోని సీనియర్లకు సెలవిస్తూ ఎంఎస్‌ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన టీమిండియా తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతాలు చేసింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్‌ శర్మతో వేయించడం.. శ్రీశాంత్‌ క్యాచ్‌ పట్టడం.. టీమిండియా గెలవడం చకచకా జరిగిపోయాయి. అలా ఆరంభంలోనే అద్భుతాన్ని చేసి చూపించాడు ధోనీ. ఐదు సార్లు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని టైటిల్‌ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు