MS Dhoni: ధోనీ మెంటార్‌గా అందుకే అవసరం

ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని టైటిల్‌ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్‌ మినహా రెండేళ్లుగా ...

MS Dhoni: ధోనీ మెంటార్‌గా అందుకే అవసరం

Ms Dhoni

MS Dhoni: టీమిండియాకు మూడు మేజర్ ఐసీసీ టోర్నీలు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోనీది. కెప్టెన్ గా ఉండకపోయినా.. జట్టుతో ఉంటే చాలు భారత జట్టు ప్రదర్శనలో తేడా ఇట్టే కనిపించేస్తుంది. కెప్టెన్ గా, కీపర్ గా, ప్లేయర్ గా చురుగ్గా వ్యూహాలు రచించి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేసే ధోనీని మెంటార్ గా తీసుకోవడం కరెక్ట్..

బ్యాట్స్‌మెన్ పొజిషనింగ్ తో పాటు కీపర్ గా బౌలర్ కు ఎటువంటి బంతిని సంధించాలో కూడా సలహా ఇస్తుంటాడు. చిరుతకు మించిన వేగం.. డేగకు మించిన నిశిత పరిశీలన ధోనీ సొంతం. 2021 టీ20 ప్రపంచకప్‌ కొట్టాలనే ప్రణాళికలో భాగంగా ఎంఎస్‌ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్మెంట్.

ఇలాంటి నిర్ణయాన్ని 2007లోనూ తీసుకుంది. 2007 వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలోని టీమిండియా లీగ్‌లో బెర్ముడాపై విజయం మినహా మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసి తొలిరౌండ్‌లోనే నిష్ర్కమించింది. అదే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని భావించింది ఐసీసీ.

టీ20 వరల్డ్ కప్ కు వెళ్లే టీమిండియా జట్టులో యువరక్తంతో నిండి ఉండాలని బీసీసీఐ భావించింది. జట్టులోని సీనియర్లకు సెలవిస్తూ ఎంఎస్‌ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన టీమిండియా తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతాలు చేసింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్‌ శర్మతో వేయించడం.. శ్రీశాంత్‌ క్యాచ్‌ పట్టడం.. టీమిండియా గెలవడం చకచకా జరిగిపోయాయి. అలా ఆరంభంలోనే అద్భుతాన్ని చేసి చూపించాడు ధోనీ.

ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని టైటిల్‌ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్‌ మినహా రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌తో సంబంధం లేకుండా ఉంటున్న ధోనీ.. బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం ‘మెంటార్‌’గా ఉండేందుకు అంగీకరించాడు. కెప్టెన్‌, కోచ్‌లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు.