సికంద్రాబాద్ బ్యాడ్మెంటెన్ అకాడమీ….చిన్నారులు బ్యాడ్మింటెన్ ఆడుతూ…బిజీ బిజీగా ఉన్నారు..తాము కూడా పెద్ద క్రీడాకారులుగా అవ్వాలని చెమటోడుస్తున్నారు. అంతలో ఇద్దరు ముసలివాళ్లు అకాడమీకి చేరుకున్నారు.
హైదరాబాద్ : సికంద్రాబాద్ బ్యాడ్మెంటెన్ అకాడమీ….చిన్నారులు బ్యాడ్మింటెన్ ఆడుతూ…బిజీ బిజీగా ఉన్నారు..తాము కూడా పెద్ద క్రీడాకారులుగా అవ్వాలని చెమటోడుస్తున్నారు. అంతలో ఇద్దరు ముసలివాళ్లు అకాడమీకి చేరుకున్నారు. ఇక్కడ ఏం పని అంటూ కోచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చిన్నారులతో కొద్దిసేపు ఆడుతామని పెద్దోళ్లు చెప్పారు. చివరకు కోచ్ ఒకే చెప్పడంతో చిన్నారులతో వారు ఆటాడారు. కానీ బ్యాట్ లేపడానికి..కిందకు వంగడానికి వృద్ధులు కష్టపడ్డారు. ఇదంతా చూస్తున్న చిన్నారులు వీరు ఏమి ఆడుతారని..టైం వేస్ట్ అనుకుంటున్నారు. ఒక్కసారి ఆశ్చర్యం…రాకెట్‌లా ఆడుతుండడంతో నోరెళ్లబెట్టారు. చివరకు వారు ఎవరో తెలిసిపోయి సంబరపడిపోయారు ఆ చిన్నారులు…
వినూత్న ప్రయత్నం…
అప్ కమింగ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు వినూత్నంగా ప్రయత్నించారు అశ్విని, శ్రీకాంత్. ఈ ఇద్దరు ముసలి వేషాలు వేసుకొని బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటున్న చిన్నారులతో పోటీపడ్డారు. ముసలి వేషాల్లో వచ్చిన అశ్విని, శ్రీకాంత్‌లను గుర్తుపట్టని చిన్నారులు ముందుగా వాళ్లతో ఆడేందుకు తటపటాయించారు. కోచ్ చెప్పడంతో ఆట ప్రారంభించారు. ముందుగా తమకు ఆడటం సరిగా రాదన్నట్టుగా నటించారు. ఆ తర్వాత ఒక్కసారి విజృంభించి ఆడటంతో అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత తమ వేషాలు తీసేసి పిల్లలందర్ని మరోసారి ఆశ్చర్యంలో ముంచేశారు. బ్యాడ్మింటన్ స్టార్లు తమ కోచింగ్ సెంటర్‌కు రావడంతో ఒక్కసారి పిల్లలంతో ఆనందంతో తబ్బిబ్బయ్యారు. అంతా కలిసి ఇద్దరు స్టార్లను చుట్టేశారు.