Site icon 10TV Telugu

మెల్‌బోర్న్ టెస్ట్: కీలక వికెట్లు డౌన్

IND vs AUS, Australia team, Key Batsmen, Australia wickets down, Boxing day Test, Team India bowlers

ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత్ పట్టుబిగించింది. టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు.

మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత్ పట్టుబిగించింది. టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ పని పట్టారు. ఇప్పటికే ఓపెనర్లను ఔట్‌ చేసి ఆసీస్‌ను దెబ్బకొట్టిన బౌలర్లు.. మరో రెండు కీలక వికెట్లను పడగొట్టారు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లకు తలనొప్పిగా మారిన ఉస్మాన్‌ ఖవాజా(33)ను షమీ పెవిలియన్ పంపగా, షాన్ మార్ష్(44 పరుగులు) ను బుమ్రా ఔట్ చేశాడు. 21వ ఓవర్లో షమీ వేసిన చివరి బంతికి ఖవాజా ఎల్బీగా వెనుదిరిగాడు.

32వ ఓవర్‌లో బుమ్రా వేసిన రెండో బంతికి మార్ష్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ జట్టు కష్టాల్లో పడింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ ఫించ్‌ (4 బంతుల్లో 3 పరుగులు) ఔటయ్యాడు. 9వ ఓవర్‌లో మరో వికెట్ కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఔట్ అయ్యింది.

Exit mobile version