CPL 2025 : క్రికెట్‌లో అప్పుడప్పుడు బ్యాటర్లు హిట్ వికెట్‌గా ఔట్ కావడాన్ని చూసే ఉంటాం. అయితే.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL 2025)లో ఓ బ్యాటర్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అతడు స్విచ్ హిట్‌కు ప్రయత్నించి హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఆదివారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గయానా తొలుత బ్యాటింగ్ చేసింది. బెన్ మెక్‌డెర్మాట్ (14), గుడాకేష్ మోటీ(1), మోయిన్ అలీ(4), హసన్ ఖాన్ (17), షిమ్రాన్ హెట్‌మయర్ (6) లు విఫలం కావడంతో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును వికెట్ కీపర్ బ్యాటర్ షైహోప్ (39; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రొమారియో షెపర్డ్(19)తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు.
Telugu Titans : తెలుగు టైటాన్స్‌కు ఏమైంది..? సొంత గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి..
మిగిలిన బ్యాటర్లు షాట్లు కొట్టేందుకు ఇబ్బంది పడగా హోప్ మాత్రం ధాటిగా ఆడాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ను టెరెన్స్ హిండ్స్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని హోప్ స్విచ్ హిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బ్యాట్ బంతిని తాకలేదు చివరికి స్టంప్స్‌ను తాకింది. దీంతో షై హోప్ హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడు. కాగా.. ఈ బంతి వైడ్ బాల్ కావడం గమనార్హం.
హోప్ ఔటైనా డ్వైన్ ప్రిటోరియస్ (21), క్వెంటిన్ సాంప్సన్ (25) లు రాణించడంతో గయానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బౌలర్లలో అకేల్ హోసిన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ONE OF THE WORST WAYS TO GET OUT. pic.twitter.com/ZMjcHWtAio
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 31, 2025
అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో అలెక్స్ హేల్స్ (74; 43 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోలిన్ మున్రో (52; 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ గోల్డెన్ డకౌట్ కాగా.. కీసీ కార్తీ పరుగులు ఏమీ చేయలేదు. కీరన్ పొలార్డ్ (12 నాటౌట్), ఆండ్రీ రస్సెల్ (27 నాటౌట్) లు రాణించారు. గయానా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ నాలుగు వికెట్లు తీశాడు.