ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నాల్గవ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ(22 సెప్టెంబర్ 2020) పోరాటం జరగబోతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ధోని జట్టు తమ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇవ్వగా, రాజస్థాన్ రాయల్స్ తమ స్టార్ ప్లేయర్స్ జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ లేకుండా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
క్వారంటైన్ పిరియడ్ పూర్తికాకపోవడంతో జట్టు స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ మొదటి మ్యాచ్‌లో పాల్గొనలేకపోతున్నాడు. బట్లర్ తన కుటుంబంతో సెప్టెంబర్ 17న యూఏఈ చేరుకున్నాడు. బట్లర్ సెప్టెంబర్ 23 వరకు నిర్బంధంలో ఉండడాలి. అనంతరం రెండు కోవిడ్-19 టెస్టులు జట్టులో చేరే ముందు నెగెటివ్ రావాలి. బెన్ స్టోక్స్ ఇంకా న్యూజిలాండ్ నుంచి దుబాయ్ చేరుకోలేదు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకోవటానికి స్టోక్స్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు.
అయితే కొంతలో కొంత జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదటి మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం రాజస్థాన్ రాయల్స్‌కు ఉపశమనం కలిగించే విషయం. స్మిత్‌తో పాటు, మొదటి మ్యాచ్‌లో మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్ళు మిల్లెర్, జోఫ్రా ఆర్చర్, టామ్ కురన్లను రాజస్థాన్ రాయల్స్ చేర్చుకోవచ్చు.
రాజస్థాన్ రాయల్స్ విజయం యువ భారత ఆటగాళ్ల ఆటతీరుపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్‌కు వెటరన్ రాబిన్ ఉతప్పతో కలిసి ఓపెనింగ్ ఇవ్వవచ్చు. జట్టు అత్యంత విశ్వసనీయ బ్యాట్స్ మాన్ సంజు సామ్సన్ మూడవ స్థానంలో క్రీజులోకి రావచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్‌పై ర్యాన్ పరాగ్‌కు రాజస్థాన్ రాయల్స్ అవకాశం ఇవ్వవచ్చు. భారత ఆటగాళ్ళు శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) ను అధిగమించడం అంత సులభం కాదు.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది. స్టార్ బ్యాట్స్ మాన్ రితురాజ్ గైక్వాడ్ రెండు కోవిడ్-19 నెగెటివ్ వచ్చాయి. అతను తిరిగి జట్టులో చేరాడు. ఈ సీజన్లో సురేష్ రైనా స్థానంలో రితురాజ్ గైక్వాడ్‌ను ఉపయోగించాలని సిఎస్కె పరిశీలిస్తోంది.
పిచ్ రిపోర్ట్: అబుదాబి మరియు దుబాయ్‌లలో మూడు మ్యాచ్‌ల తరువాత, లీగ్ థ్రిల్ ఇప్పుడు షార్జాకు చేరుకుంది. ఈ మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. దుబాయ్ లేదా అబుదాబికి భిన్నమైన ఉపరితలం ఈ స్టేడియంలో ఉంటుంది. ఇది బౌలర్లకు కఠినమైన సవాలుగా నిలుస్తుంది. రెండు వేదికలకు భిన్నంగా, ఇక్కడ అధిక స్కోర్ కార్డులు కనిపించవచ్చు. ఇక్కడ బ్యాట్స్ మెన్లకు అనుకూలంగా ఉంటుంది.
RR PLAYING XI(అంచనా): యశస్వి జైస్వాల్, రాబిన్ ఉతప్ప, స్టీవ్ స్మిత్ (సి), డేవిడ్ మిల్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), టామ్ కర్రన్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్గత్, అంకిత్ రాజపుత్ర / వరుణ్ ఆరోన్ / కార్తీక త్యాగి
CSK PLAYING XI(అంచనా): మురళీ విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, రితురాజ్ గైక్వాడ్/కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (సి & డబ్ల్యుకె), రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగీ ఎంగిడి
RR vs CSK Dream11 Team:
షేన్ వాట్సన్ (కెప్టెన్), సంజు శాంసన్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, అంబటి రాయుడు, ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్