Ravindra Jadeja : రవీంద్ర జడేజా చీఫ్ సెలెక్టర్ అవుతాడా? బీసీసీఐ పోస్టుకు షాకింగ్ కామెంట్.. అలా అన్నావేంటి భయ్యా..!

Ravindra Jadeja : అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం అక్టోబర్ 4న ముగిసింది. అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. జడేజా దానికి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు.

Ravindra Jadeja

Ravindra Jadeja : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన కామెంట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో.. ఆ స్థానానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిపై జడేజా స్పందిస్తూ.. ‘ప్రాసెస్ ఏంటి?’ అంటూ ప్రశ్నించాడు. దీంతో జడేజా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జడ్డూ భాయ్.. చీఫ్ సెలెక్టర్ అవుతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read : IND vs WI : భార‌త్ వ‌ర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్‌.. సోనీలో రాదు.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం అక్టోబర్ 4న ముగిసింది. అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. జడేజా దానికి స్పందిస్తూ ‘ప్రాసెస్ ఏంటి?’ అని కామెంట్ చేశాడు. రెండేళ్ల కిందట రవీంద్ర జడేజాను కొన్ని వన్డే సిరీస్‌లకు అగార్కర్‌ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. అప్పుడు వీరిద్దరి మధ్య సంబంధాలు చెడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జడేజా తాజా పోస్ట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

జడేజా పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది జడేజా సెలక్షన్ కమిటీ చీఫ్‌ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ పేర్కొంటున్నారు. అయితే, జడేజా ఈ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హుడు. ఎందుకంటే.. ప్రస్తుత బీసీసీఐ నిబంధనల ప్రకారం.. యాక్టివ్ క్రికెటర్‌ సెలక్షన్ కమిటీలో కీలక పదవిని చేపట్టేందుకు అర్హుడు కాదు. అంతేకాదు.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయి ఉండాలి. జడేజా ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లోనూ కొనసాగుతున్నాడు. అందువల్ల అతడు ఈ పదవికి అర్హుడు కాదు. కేవలం సరదాగానే జడేజా ఈ పోస్టు పెట్టినట్లు పలువురు పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. అగార్కర్ పదవీకాలం ముగియడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల స్పందించాడు. చరిత్ర అగార్కర్‌ను మరింత గొప్పగా గుర్తుంచుకుంటుంది అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీకి ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక కోసం బీసీసీఐ ప్రక్రియను మొదలు పెట్టింది.