Site icon 10TV Telugu

IND vs AUS: బస్సులో క్రికెటర్ల హోలీ.. కోహ్లీ, రోహిత్ అల్లరి.. వీడియో షేర్ చేసిన శుభ్‌మన్‌గిల్

IND vs AUS

IND vs AUS: దేశవ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Telangana MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. 9న నామినేషన్లు దాఖలు

కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపుకోవడం ఈ వీడియోలో హైలైట్. గురువారం నుంచి ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరగబోతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు బస్సులో వెళ్తుండగా హోలీ జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. కోహ్లీ పాటపడుతూ రంగులు చల్లాడు. కోహ్లీ వెనకే ఉన్న రోహిత్ శర్మ కూడా కోహ్లీపై రంగులు చల్లుతూ డ్యాన్స్ చేశాడు. ఈ దృశ్యాన్ని యువ ఆటగాడు శుభ్‌మన్‌గిల్ తన మొబైల్ కెమెరాలో బంధించాడు. అనంతరం ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ

రోహిత్, కోహ్లీ, ఇతర ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ, సందడిగా హోలీ జరుపుకోవడం ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక.. గురువారం నుంచి జరగబోయే మ్యాచ్‌కు ప్రధాని మోదీ హాజరవుతారు. ఆయన ప్రత్యక్షంగా మ్యాచ్ చూడబోతున్నారు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా లేదా డ్రా చేసినా సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఒకవేళ ఓడితే సిరీస్ సమం అవుతుంది.

Exit mobile version