Telangana MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. 9న నామినేషన్లు దాఖలు

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Telangana MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. 9న నామినేషన్లు దాఖలు

Telangana MLC: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ

మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించాల్సి ఉంది. కేబినెట్ భేటీ తర్వాత అభ్యర్థుల్ని సీఎం ప్రకటిస్తారు. తాజా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ముగ్గురిలో కుర్మయ్యగారి నవీన్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Nagpur: ప్రాణం తీసిన వయాగ్రా.. రెండు మాత్రలు వేసుకుని వ్యక్తి మృతి

ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకపాత్ర పోషించారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి దేశపతి శ్రీనివాస్ కవిగా, ఉద్యమకారుడిగా పేరు పొందారు. ప్రభుత్వ టీచర్ అయిన దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని కీలక పాత్ర పోషించారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై దేశపతి మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది నాకు ఇచ్చిన గౌరవం. శాసన మండలిలో నా వంతు పాత్ర పోషిస్తా’’ అన్నారు.

దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్.. ఇద్దరూ చాలా ఏళ్లుగా కేసీఆర్ వెంటే ఉన్నారు. మరో అభ్యర్థి చల్లా వెంకట్రామి రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన మాజీ రాష్ట్రపతి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నీలం సంజీవ రెడ్డి మనవడు. రాజకీయంగా ఆయనకు సొంత ప్రాంతంలో మంచి పట్టుంది.