David Warner : ఆత్మ‌క‌థ రాస్తున్న డేవిడ్ వార్న‌ర్‌.. జ‌స్ట్ 2వేల పేజీలేన‌ట‌.. చ‌దివితే..

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

David Warner

David Warner Autobiography : ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న దూకుడైన బ్యాటింగ్‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వ‌న్డేల‌కు, టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన అత‌డు ఇక టీ20ల్లో మాత్ర‌మే క‌నిపించ‌నున్నాడు. అయితే.. తాజాగా వార్న‌ర్ త‌న అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పాడు. త‌న‌ ఆత్మ‌క‌థ‌ను రాస్తున్న‌ట్లు చెప్పాడు. ఈ ఆటోబ‌యోగ్ర‌ఫీలో తాను వెల్ల‌డించే విష‌యాలు ఎంతో మందిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయ‌న్నాడు. అంతేనా ఈ పుస్త‌కం ఏకంగా 2 వేల పేజీలు ఉంటుంద‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.

‘అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఆత్మ క‌థ‌ను రాస్తున్నాను. ఈ పుస్త‌కం ద్వారా ఎన్నో సంచ‌ల‌న విష‌యాల‌ను అంద‌రితో పంచుకోబోతున్నాను.’ అని వార్న‌ర్ తెలిపాడు. ఇక ఈ పుస్త‌కంలో త‌న కెరీర్‌లో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయిన 2018లో జ‌రిగిన బాల్ టాంప‌రింగ్ ఉదంతం గురించి కూడా ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పాడు. పుస్త‌కం పూర్తి కావొచ్చింద‌న్నాడు. ఇప్ప‌టికే 1500 పేజీలు అయ్యాయ‌ని, మ‌రికొన్ని పేజీలు జోడిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. పుస్త‌కం పూర్తి అయ్యే నాటికి 2 వేల పేజీలు అవ్వొచ్చున‌ని వెల్ల‌డించాడు.

Aakash Chopra : వైస్ కెప్టెన్‌కి చోటు లేదా..? ఇషాన్ కిష‌న్ ప‌రిస్థితేంటి..?

త‌న ఓపెనింగ్ స్థానాన్ని ఎవ‌ర‌ను భ‌ర్తీ చేయ‌గ‌ల‌రు అనే ప్ర‌శ్న ఎదురుకాగా.. మార్క‌స్ హ్యారిస్ పేరు చెప్పాడు. స్టీవ్ స్మిత్ కూడా ఆ స్థానంలో రాణించ‌గ‌ల స‌మ‌ర్థుడే అని అన్నాడు. ఇన్ని విష‌యాల‌ను చెప్పిన వార్న‌ర్ ఆ పుస్త‌కం పేరు ఏంటి? ఎప్ప‌డు విడుద‌ల కానుంది? అనే విష‌యాలు మాత్రం తెలప‌లేదు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రికీ పాంటింగ్ త‌రువాత అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియా ఆట‌గాడిగా డేవిడ్ వార్న‌ర్ నిలిచాడు. నాలుగు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆసీస్ జ‌ట్టులో స‌భ్యుడైన వార్న‌ర్ పేరిట ప‌లు రికార్డులు ఉన్నాయి. అన్ని ఫార్మాట్ల‌ల‌లో సెంచ‌రీలు అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఓపెన‌ర్ల జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచి చ‌రిత్ర సృష్టించాడు. ఇంత‌క‌ముందు ఈ రికార్డు స‌చిన్ పేరిట ఉండేది. ఓపెన‌ర్‌గా స‌చిన్ 45 శ‌త‌కాలు చేయ‌గా వార్న‌ర్ 49 సెంచ‌రీలు చేశాడు.

Mohammed Shami : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అర్జున అవార్డు.. క‌ల నెర‌వేరింద‌న్న ష‌మీ

ట్రెండింగ్ వార్తలు