David Warner : రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. నవ్వులే నవ్వుల్.. కెమెరాను బద్దలు కొట్టి..
మనదేశంలో సినిమాలకు, క్రికెట్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది.
- Thota Vamshi Kumar
- Published On : April 12, 2024 / 04:01 PM IST
David Warner Teams Up with Director SS Rajamouli for a Hilarious Ad
David Warner – SS Rajamouli : మనదేశంలో సినిమాలకు, క్రికెట్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. క్రికెట్ కథాంశంతో వచ్చే సినిమాలపై మంచి అంచనాలే ఉంటాయి. ఇక ఓ స్టార్ క్రికెటర్‌తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది గదా. ఆ చిత్రాన్నికి దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తే.. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందులో నటిస్తే ఇంకా చెప్పేది ఏముంది. అయితే.. వీరిద్దరు సినిమాను చేయలేదు గానీ, ఓ యాడ్‌లో కలిసి నటించారు. ఈ యాడ్ చూస్తే నవ్వకుండా ఉండలేరు.
క్రెడ్ యూపీఐ ప్రమోషన్‌లో భాగంగా ఓ యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో డేవిడ్‌వార్నర్‌ను రాజమౌళి టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే డిస్కౌంట్ లభిస్తుందని వార్నర్ అంటాడు. ‘ఒకవేళ నా దగ్గర మామూలు యూపీఐ ఉంటే’ అని రాజమౌళి ప్రశ్నించగా.. అందుకు తనకు ఓ ఫేవర్ చేయాలని వార్నర్ అడుగుతాడు.
ఇక్కడ నుంచి కథ మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో వార్నర్ పలు పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. వార్నర్‌తో యాక్టింగ్ చేయించడం కోసం జక్కన్న పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. మధ్యలో ఆస్కార్ వేదిక పై కలుద్దాం.. గుర్రానికి బదులుగా కంగారు లేదా? అంటూ వార్నర్ చెప్పిన డైలాగ్‌లు నవ్వును తెప్పిస్తారు. ఆఖర్లో వార్నర్ ఏకంగా కెమెరాను బద్దలు కొట్టేస్తాడు.
దీన్నంతా రాజమౌళి ఊహించుకుంటాడు. ఊహా నుంచి బయటకు వచ్చిన జక్కన నేను క్రెడ్ యాప్‌కు అప్‌గ్రేడ్ అవుతాను అని చెప్పడంతో యాడ్ ముగిసింది. ఈ యాడ్ వైరల్‌గా మారగా.. డేవిడ్ వార్నర్ హీరోగా సెటిల్ అయిపోవచ్చు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Warner bros ? @ssrajamouli pic.twitter.com/PfE0Sn9Tb0
— David Warner (@davidwarner31) April 12, 2024
