Ishan Kishan : మౌనం వీడిన ఇషాన్ కిష‌న్‌.. కాంట్రాక్ట్ కోల్పోవ‌డం, టీమ్ఇండియాలో భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంపై

విజ‌యం సాధించిన అనంత‌రం ఇషాన్ మీడియాతో మాట్లాడాడు.

Ishan Kishan : మౌనం వీడిన ఇషాన్ కిష‌న్‌.. కాంట్రాక్ట్ కోల్పోవ‌డం, టీమ్ఇండియాలో భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంపై

Pic @ BCCI Twitter

Ishan Kishan Breaks Silence : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. వాంఖ‌డే వేదిక‌గా గురువారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ముంబై విజ‌యంలో ఇషాన్ కిష‌న్ (69; 34 బంతుల్లో 7 ఫోర్లు, 5సిక్స‌ర్లు) త‌న వంతు పాత్ర పోషించాడు. 197 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో రోహిత్ శ‌ర్మ‌(38)తో క‌లిసి మెరుపు ఆరంభాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన అనంత‌రం ఇషాన్ మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ ఆరంభానికి ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు.. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ కోల్పోవ‌డం, టీమ్ఇండియాలో అత‌డి భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌రంగా మారడం వంటి విష‌యాల పై స్పందించాడు.

మాన‌సిక అల‌స‌టతో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు ఇషాన్ కిష‌న్‌. ఆ త‌రువాత జాతీయ జ‌ట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా రంజీ ట్రోఫీ ఆడాల‌ని సూచించిన‌ప్ప‌టికీ ఇషాన్ మాత్రం హార్దిక్ పాండ్య‌తో క‌లిసి ఐపీఎల్ కోసం స‌న్న‌ద్ధం అయ్యాడు.

Rohit Sharma : ‘డికే.. నువ్వు ప్ర‌పంచ‌క‌ప్ ఆడాలి..’ దినేశ్ కార్తీక్‌తో రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

ఇషాన్‌ మాట్లాడుతూ.. ‘నేను ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఆటకు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎంతో మంది ఎన్నో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో సైతం అనేక విషయాలు వచ్చాయి. అయితే చాలా విషయాలు ఆట‌గాళ్ల చేతుల్లో ఉండ‌వ‌నే విష‌యాన్ని మీరు గుర్తించాలి.’ అని ఇషాన్ అన్నాడు.

సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడమే చేయగలిగిన ఏకైక పని అని అన్నాడు. ‘గ‌తంలో అయితే బౌల‌ర్లు ఎంత మంచి బంతులు వేస్తున్నప్ప‌టికీ కూడా మొద‌టి రెండు ఓవ‌ర్ల‌లో ఒక్క బంతిని కూడా వ‌దిలి పెట్టేవాడిని కాదు. అయితే.. నేను ఓ విష‌యాన్ని నేర్చుకున్నాను. టీ20 కూడా పెద్ద గేమే. ఇక్క‌డ మీరు కాస్త స‌మ‌యాన్ని తీసుకుని ఆ త‌రువాత మీ స‌హ‌జ‌శైలిలో ఆడొచ్చు. మ‌నం మ్యాచ్‌లు ఓడిన‌ప్ప‌టికీ కూడా మేమంతా ఓ జ‌ట్టుగా ప‌ని చేయాల‌ని అనుకుంటున్నాము.’ అని ఇషాన్ చెప్పాడు.

విరామ స‌మ‌యంలో నాలో చాలా మార్పు వచ్చింది. నేను బాగా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క‌పోయినా, వేరొక‌రు ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం లేద‌ని తెలిసినా వెంట‌నే వెళ్లి వాళ్ల‌తో మాట్లాడ‌తాను. ఎందుకంటే వాళ్లు ఏమీ ఆలోచిస్తున్నార‌నే విషయాన్ని తెలుసుకుంటాను. అని ఇఫాన్ కిష‌న్ తెలిపాడు.

Sunil Gavaskar : అత‌డిపై ఓ క‌న్నేసి ఉంచండి.. 15 ఇన్నింగ్స్‌ల్లో 10 హాఫ్ సెంచ‌రీలు.. : సునీల్ గ‌వాస్క‌ర్‌