డికే.. నువ్వు ప్ర‌పంచ‌క‌ప్ ఆడాలి.. దినేశ్ కార్తీక్‌తో రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

క్రికెట్‌లో ఆట‌గాళ్ల ఏకాగ్ర‌త‌ను చెడ‌గొట్ట‌డానికి ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు స్లెడ్జింగ్ చేస్తుండ‌టాన్ని చూస్తూనే ఉంటాం.

డికే.. నువ్వు ప్ర‌పంచ‌క‌ప్ ఆడాలి.. దినేశ్ కార్తీక్‌తో రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Rohit Sledges Karthik With World Cup Remark video viral

Rohit Sharma – Dinesh Karthik : క్రికెట్‌లో ఆట‌గాళ్ల ఏకాగ్ర‌త‌ను చెడ‌గొట్ట‌డానికి ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు స్లెడ్జింగ్ చేస్తుండ‌టాన్ని చూస్తూనే ఉంటాం. ఇది ప‌రిధి దాట‌నంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. వాంఖ‌డే వేదిక‌గా రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఆర్‌సీబీ బ్యాట‌ర్ దినేశ్ కార్తీక్‌ను స‌ర‌దాగా స్లెడ్జ్ చేశాడు. డీకే మ‌న‌సులో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడాల‌ని ఉంద‌ని, అందుకోస‌మే అత‌డు హిట్టింట్ చేస్తున్న‌ట్లు రోహిత్ అన్నాడు.

ఐపీఎల్‌లో గ‌త కొన్నాళ్లుగా రాయ‌ల్స్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు దినేశ్ కార్తీక్‌. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వేగంగా ప‌రుగులు చేస్తూ మంచి ఫినిష‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ దంచికొట్టాడు. కాగా.. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో రోహిత్ ఆట‌ప‌ట్టించాడు.

‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నాడు. సెల‌క్ష‌న్ కోసం అద‌ర‌గొడుతున్నాడు. డీకే.. నువ్వు ప్ర‌పంచ‌క‌ప్ ఆడాలి.’ అని రోహిత్ అన్నాడు. రోహిత్ చేసిన వ్యాఖ్య‌లు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. కాగా.. రోహిత్ స‌ర‌దాగా అన్నా కూడా డీకే దానిని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా క‌నిపించింది. అత‌డు త‌న బ్యాటుతో పెను విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 53 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

Also Read : అత‌డిపై ఓ క‌న్నేసి ఉంచండి.. 15 ఇన్నింగ్స్‌ల్లో 10 హాఫ్ సెంచ‌రీలు.. : సునీల్ గ‌వాస్క‌ర్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్‌ చేసిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. డుప్లెసిస్ (61), ర‌జ‌త్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్‌) అర్థ‌శ‌త‌కాలు బాదారు. ముంబై బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్ల‌తో బెంగ‌ళూరు న‌డ్డి విరిచాడు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ముంబై 15.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ముంబై బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (69 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (52 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు అర్థ‌శ‌త‌కాలు చేశారు. రోహిత్ శ‌ర్మ (38 24 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్స‌ర్లు), హార్దిక్ పాండ్య (21నాటౌట్ 6 బంతుల్లో 3 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు.

Also Read : ఓట‌మి బాధ‌లో ఉన్న సంజూ శాంస‌న్‌కు భారీ షాక్‌.. రూ.12 లక్ష‌ల ఫైన్‌

 

View this post on Instagram

 

A post shared by Happyclubwala (@happyclubwala)