Defamation case filed against Khushi Mukherjee over Comments on Suryakumar Yadav
Suryakumar Yadav : నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది. ఆమె పై ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా నమోదైంది. ఆమె టీమ్ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. అయితే ఇక్కడ సూర్య.. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇంత వరకు స్పందించలేదు. అయినప్పటికి కూడా సూర్యకుమార్ యాదవ్‌కు అభిమాని అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి.. ఖుషీ ముఖర్జీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు.
గత ఏడాది (2025) చివరిలో ఓ పాడ్ కాస్ట్‌లో ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. తనకు ఏ క్రికెటర్‌తో డేటింగ్ చేయడం ఇష్టం లేదని చెప్పింది. అదే సమయంలో తన వెంట చాలా మంది క్రికెటర్లు పడేవారంది. ముఖ్యంగా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు తరచుగా మెసేజ్‌లు చేసేవాడని అంది. ఇప్పుడు మాత్రం అతడు తనతో పెద్దగా మాట్లాడడం లేదని, తనకు కూడా అతడిని తిరిగి కలవాలని లేదని అంది. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని అంది.
ఖుషీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి ఖుషీ మాట్లాడుతూ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సూర్యతో ఎలాంటి ప్రేమ సంబాషణలు జరగలేదని, కేవలం పరిమితమైన స్నేహపూర్వకరమైన సంబాషణ మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. అయినప్పటికి కూడా ఆమెపై విమర్శల జడివాన ఆగడం లేదు. ఇక ఇప్పటి వరకు ఈ విషయం పై సూర్యకుమార్ యాదవ్ బహిరంగంగా ఎక్కడ స్పందించలేదు.
సూర్యకు అభిమాని అని చెప్పుకుంటున్న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ఫైజన్ అన్సారీ మాత్రం ఖుషీ ముఖర్జీ పై పరువు నష్టం దావా వేశాడు. ఖుషీ చేసిన వ్యాఖ్యలు అన్నీ అబద్దాలు అని, తనకు సూర్య గురించి బాగా తెలుసునని చెప్పాడు. పబ్లిసిటీ కోసమే స్టార్ ప్లేయర్ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న సూర్య..
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 2025 ఏడాదిలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. 21 టీ20 మ్యాచ్‌ల్లో 13.62 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు.
David Warner : శతకంతో చెలరేగిన డేవిడ్ వార్నర్.. బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు..
టీ20 ప్రపంచకప్ 2026 ముందు కివీస్‌తో జనవరి 21 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.