Delhi Batsman: క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు.. టీ20లో డబుల్ బాదుడు!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ బ్యాట్స్‌‍మెన్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్ళు సైతం టీ20 క్రికెట్‌లో క్రియేట్ చెయ్యలేని రికార్డును ఢిల్లీ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్న సుబోధ్ భాటి సాధించాడు.

Subodh Bhati’s Double century in T20: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ బ్యాట్స్‌‍మెన్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్ళు సైతం టీ20 క్రికెట్‌లో క్రియేట్ చెయ్యలేని రికార్డును ఢిల్లీ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్న సుబోధ్ భాటి సాధించాడు. సుబోద్ 79 బంతుల్లో 17 సిక్సర్లు, 17 ఫోర్ల సహాయంతో 205 పరుగులు చేసి సరికొత్త రికార్డును నమోదుచేశాడు సుబోధ్. 34 బంతుల్లో కేవలం ఫోర్లు, సిక్సర్లతో 170 పరుగులు చేశాడు సుబోధ్.

ఓ క్లబ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్న 30ఏళ్ల సుబోధ్ సింబాపై ఈ ఘనత సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఎలెవన్ సుబోధ్ చేసిన ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌తో 256పరుగులు చేయగలిగింది. తొలి వంద పరుగులను కేవలం 17 బంతుల్లో చేశాడు. సుబోధ్ 259.49 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సింబా జట్టు 18వ ఓవర్లో 199పరుగులకు ఆలౌట్ అయ్యి, మ్యాచ్‌ను 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. సుబోధ్ భాటి 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్‌ల్లో ఢిల్లీ తరుపున ఆడాడు. టీ20 క్రికెట్‌లో గేల్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 నాటౌట్ ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఐపిఎల్‌లో పూణే వారియర్స్‌పై 2013 సంవత్సరంలో చేశాడు. 66 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు గేల్. తరువాత ట్రై-సిరీస్‌లో జింబాబ్వేపై ఆరోన్‌ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు