ధోనీ వచ్చాడు: స్టేడియంలో ఫుల్ జోష్‌తో అభిమానులు

కొద్ది నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మహీని మైదానంలో చూసేసరికి అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ధోని అతిథిగా విచ్చేశాడు. తన పేరిట ఉన్న పెవిలియన్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించేందుకు వచ్చాడు. అతని మేనేజర్ దివాకర్ శుక్రవారం మాట్లాడుతూ ధోనీ వచ్చే సంగతి ముందుగానే తెలియజేశాడు. 

అతనితో పాటు పలువురు సీనియర్లు ధోనీ లేకుండా రాంచీ స్టేడియం లేదు. టీమిండియా మ్యాచ్ జరుగుతుంటే కచ్చితంగా వస్తాడంటూ విశ్వాసాన్ని కనబరిచారు. ముంబై నుంచి శనివారం ఉదయమే వచ్చిన ధోనీ స్టేడియానికి చేరుకున్నాడు. 

కాగా, ధోనీకి టీమిండియాలో చోటుపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గంగూలీని మీడియా ప్రతినిధులు జట్టులో ధోనీ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తగా.. తానూ అక్టోబరు 24న సెలక్టర్లతో మాట్లాడతానని వాళ్ల అభిప్రాయం తెలుసుకుని ఓ నిర్ణయానికి వస్తామని చెప్పుకొచ్చాడు.