MS Dhoni Fan : ఉప్పల్‌లో ధోని ఫ్యాన్‌కు షాకింగ్ అనుభవం.. ‘నా సీటు కనిపించడం లేదు.. ఎవరైనా చూశారా?’
ధోనిని ప్రత్యక్షంగా వీక్షిద్దామని వచ్చిన ఓ చెన్నై అభిమానికి వింత అనుభవం ఎదురైంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 6, 2024 / 03:26 PM IST
Dhoni Fan Demands Refund After Rs 4500 Ticket For CSK vs SRH Leaves Him Standing
MS Dhoni Fan : ఉప్పల్ వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్‌ను, ధోనిని ప్రత్యక్షంగా వీక్షిద్దామని వచ్చిన ఓ చెన్నై అభిమానికి వింత అనుభవం ఎదురైంది. వేల రూపాయలు వెచ్చించి టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఎంతో ఉత్సాహంగా స్టేడియంలోకి అడుగుపెట్టాడు. హ్యాపీగా సీటులో కూర్చోని మ్యాచ్ చూడాలని భావించగా.. తనకు వచ్చిన కష్టం కారణంగా దాదాపు నాలుగు గంటల పాటు నిలబడే మ్యాచ్‌ను వీక్షించాడు.
జునైద్ అహ్మద్ అనే వ్యక్తి రూ.4500 పెట్టి మ్యాచ్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అతడికి గ్రౌండ్ ఫ్లోర్లో జే-66 సీట్ నంబర్‌ను కేటాయించారు. మ్యాచ్ చూసేందుకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టాడు. జే సిరీస్ సీట్ల వద్దకు వెళ్లాడు. ఎంత వెదికినప్పటికీ అతడికి కేటాయించిన సీటు నంబర్ కనబడలేదు.
Also Read: 3 బాల్స్ కోసం ధోని బ్యాటింగ్‌కు రావాలా? ఏంటిది రుతురాజ్..? కాస్త ముందు పంపవయ్యా!
అతడికి ముందు వెనుక నంబర్లు అయిన జే-65, జే-67 సీట్ల నంబర్లు ఉన్నాయి గానీ అతడి సీటు నంబర్ అయిన జే-66 లేదు. దీంతో మ్యాచ్ మొత్తం అతడు నిలబడే చూశాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన అతడు తనకు కలిగిన అసౌకర్యాన్ని తెలియజేస్తూ హెచ్‌సీఏ పై మండిపడ్డాడు. తనకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశాడు.
అతడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది నీకు, ఖచ్చితంగా హెచ్‌సీఏ డబ్బులు రీఫండ్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: కావ్యా పాప మళ్లీ నవ్వింది.. పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?
