Kavya Maran : కావ్యా పాప మ‌ళ్లీ న‌వ్వింది.. ప‌క్క‌న ఉన్న అమ్మాయి ఎవ‌రో తెలుసా?

ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించ‌డంతో టీమ్ స‌హ య‌జ‌మాని కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగిపోయింది.

Kavya Maran : కావ్యా పాప మ‌ళ్లీ న‌వ్వింది.. ప‌క్క‌న ఉన్న అమ్మాయి ఎవ‌రో తెలుసా?

screengrab from video posted on x by@IPL

Kavya Maran Smile : సొంత మైదానంలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించింది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఉప్ప‌ల్ మైదానంలో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శుక్ర‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించ‌డంతో టీమ్ స‌హ య‌జ‌మాని కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. గెలిచాం అంటూ సంతోషంతో చ‌ప్ప‌ట్ల‌తో జ‌ట్టును అభినందించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స‌హ య‌జ‌మాని అయిన కావ్య మార‌న్‌కు క్రికెట‌ర్ల కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఆమె త‌న జ‌ట్టు ఆడే ప్ర‌తి మ్యాచ్‌కు హాజ‌రవుతూ ఉత్సాహ‌ప‌రుస్తూ ఉంటుంది. త‌న జ‌ట్టు విజ‌యం సాధిస్తే ఆనందంతో గంతులు వేసే కావ్య‌.. ఓడితే మాత్రం నిరుత్సాహ‌ప‌డుతుంటుంది. మ్యాచ్ అనంత‌రం ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అందుక‌నే కెమెరామెన్లు సైతం మ్యాచ్ అయిపోగానే కావ్య మీదే ఫోక‌స్ చేస్తుంటారు.

SRH vs CSK : ధోని బ్యాటింగ్‌కు రాకుండా క‌మిన్స్ కుట్ర? జ‌డేజా ర‌నౌట్ అప్పీల్ వెన‌క్కి..

చెన్నై మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించ‌డంతో కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. కావ్య పాప మ‌ళ్లీ న‌వ్వింది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. మ‌రో ఫోటో సైతం వైర‌ల్‌గా మారింది. ఆఫోటో కావ్య ప‌క్క‌న ఎవ‌రో అమ్మాయి నిలుచుని విజ‌య చిహ్నం చూపిస్తూ ఉంది. ఆ అమ్మాయి ఎవ‌రా అనీ నెటిజ‌న్లు తెగ వెదికేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవ‌రో కాదు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సోద‌రి.

IPL 2024 : అభిషేక్ శర్మ, ధోనీ గురించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్

ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతులు ఎదుర్కొన్న అత‌డు 308.33 స్ట్రైక్‌రేటుతో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 37 ప‌రుగులు చేశాడు.

ముంబై జట్టు గెలవాలి స్వామీ..!! సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. వీడియోలు వైరల్

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్ర‌యాణం ప‌డుతూ లేస్తూ సాగుతోంది. ఈ సీజ‌న్‌ను ఓట‌మితో ఆరంభించిన ఎస్ఆర్‌హెచ్ ఆ త‌రువాతి మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఓడిపోయిన ఆ జ‌ట్టు నాలుగో మ్యాచ్‌లో గెలుపొందింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు ఆడిన స‌న్‌రైజ‌ర్స్ రెండు విజ‌యాలు, రెండు ఓట‌ముల‌తో నిలిచింది. నాలుగు పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుంది.