SRH vs CSK : ధోని బ్యాటింగ్‌కు రాకుండా క‌మిన్స్ కుట్ర? జ‌డేజా ర‌నౌట్ అప్పీల్ వెన‌క్కి..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

SRH vs CSK : ధోని బ్యాటింగ్‌కు రాకుండా క‌మిన్స్ కుట్ర? జ‌డేజా ర‌నౌట్ అప్పీల్ వెన‌క్కి..

IPL 2024 Cummins Withdraws Run Out Appeal vs Jadeja For Field Obstruction

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. సొంత గ‌డ్డ‌పై డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించింది. ఉప్ప‌ల్‌లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన స‌న్‌రైజ‌ర్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబె(45; 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), అజింక్యా ర‌హానే (35; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), ర‌వీంద్ర జ‌డేజా (31 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు.

అనంత‌రం ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ 18.1 ఓవ‌ర్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్‌క్ర‌మ్(50; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) అర్ధ‌శ‌త‌కం చేశాడు. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(37; 12 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్స‌ర్లు), ట్రావిస్ హెడ్ (31; 24 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌) దూకుడుగా ఆడారు.

IPL 2024 : అభిషేక్ శర్మ, ధోనీ గురించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్

ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. చెన్నై ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో ఇది జ‌రిగింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో జ‌డేజా షాట్ ఆ బంతి నేరుగా బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. అప్ప‌టికే ర‌న్ తీద్దామ‌ని భావించిన జ‌డేజా క్రీజు దాటి చాలా ముందుకు వ‌చ్చాడు. భువ‌నేశ్వ‌ర్ బంతిని అందుకోవ‌డం చూసిన జ‌డేజా మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లాడు. భువ‌నేశ్వ‌ర్ వికెట్ వైపు బాల్ విస‌ర‌గా అది జ‌డేజా వీపు కింది భాగంలో తాకింది.

ర‌నౌట్ కావొద్దు అని జ‌డేజా ఉద్దేశ‌పూర్వ‌కంగానే బంతికి అడ్డం వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ కీప‌ర్ హెన్రిచ్ క్లాసెన్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ‘‘అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌’’కు సిగ్నల్‌ ఇచ్చాడు. అంపైర్లు సైతం స్ప‌ష్ట‌త కోసం థ‌ర్డ్ అంపైర్‌ను సంప్ర‌దించేందుకు సిద్దం అవుతున్న స‌మ‌యంలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ క‌మిన్స్ అప్పీల్‌ను వెన‌క్కి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. అత‌డు అప్పీల్‌ను వెన‌క్కి తీసుకోకుంటే జ‌డేజా ఔట్ అయ్యేవాడు.

ధోనిని క్రీజులోకి రాకుండా చేయాల‌నే..

దీనిపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ స్పందించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రెండు ప్ర‌శ్న‌లు సంధించాడు. ఇది వారి ఆట‌లో ఏమైనా వ్యూహాం కావొచ్చు. ఇబ్బంది ప‌డుతున్న జ‌డేజాను క్రీజులోనే ఉండ‌నిచ్చి, ఫామ్‌లో ఉన్న ధోనిని బ్యాటింగ్ రాకుండా చేయ‌డం వారి ఉద్దేశమేమో? ఒక‌వేళ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లి గ‌నుక ఇలాంటి ప‌నినే చేస్తే అప్పుడు కూడా నువ్వు ఇలాగే చేస్తావా? అని కైఫ్ ప్ర‌శ్నించాడు.

ముంబై జట్టు గెలవాలి స్వామీ..!! సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. వీడియోలు వైరల్

కొంద‌రు ప్యాట్ క‌మిన్స్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్ట‌గా మ‌రికొంద‌రు మాత్రం అత‌డిని స‌మ‌ర్థించారు. అత‌డు క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించాడ‌ని అంటున్నారు.

 

Rishabh Pant : ఒకే ఓవ‌ర్‌లో రిష‌బ్ పంత్ 4,6,6,4,4,4 .. షారుఖ్ ఖాన్ రియాక్ష‌న్ వైర‌ల్‌