MS Dhoni : 3 బాల్స్ కోసం ధోని బ్యాటింగ్‌కు రావాలా? ఏంటిది రుతురాజ్‌..? కాస్త ముందు పంప‌వ‌య్యా!

ఐపీఎల్17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

MS Dhoni : 3 బాల్స్ కోసం ధోని బ్యాటింగ్‌కు రావాలా? ఏంటిది రుతురాజ్‌..? కాస్త ముందు పంప‌వ‌య్యా!

Cant understand why Dhoni was out there for just 3 balls

MS Dhoni – Ruturaj Gaikwad : ఐపీఎల్17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. ఈ క్ర‌మంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు మ‌హేంద్ర ధోని పై విమ‌ర్శ‌ల‌కు తెర‌లేసింది. స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో చివ‌రి మూడు బంతులు మిగిలిన ఉన్న స‌మ‌యంలో ధోని బ్యాటింగ్‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

చెన్నై సూప‌ర్ కింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ధోని క్రీజులో అడుగుపెట్టాడు. మూడు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుంద‌న‌గా బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని ఓ ప‌రుగు సాధించాడు. దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచింద‌న్నాడు. ధోనిని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు పంపాల‌న్నాడు. మూడు బంతులు మిగిలి ఉన్న స‌మ‌యంలో అస‌లు ధోని ఎందుకు బ్యాటింగ్‌కు వ‌చ్చాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు.

Kavya Maran : కావ్యా పాప మ‌ళ్లీ న‌వ్వింది.. ప‌క్క‌న ఉన్న అమ్మాయి ఎవ‌రో తెలుసా?

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోని 16 బంతుల్లో 37 ప‌రుగులు చేసిన సంగ‌తిని ప్ర‌స్తావించాడు. అదే వ్యూహాన్ని హైద‌రాబాద్ మ్యాచ్‌లో ఎందుకు అనుస‌రించ‌లేదో తెలియ‌లేద‌న్నాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రుతురాజ్ వ్యూహాన్ని ప్రశ్నించాడు. ధోనిని ముందుగానే పంపి ఉంటే మ‌రిన్ని ప‌రుగులు సీఎస్‌కే చేసి ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్, జ‌య‌దేవ్ ఉన్క‌ద‌త్ లు ఆఫ్ క‌ట్ట‌ర్ ప్లానింగ్‌తో బౌలింగ్ చేశార‌ని ఆ స‌మ‌యంలో రైట్ హ్యాండ్ బ్యాట‌ర్ అయిన ధోని అక్క‌డ ఉండి ఉంటే భారీ షాట్లు ఆడే వాడ‌ని అన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 న‌ష్ట‌పోయి 165 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబె( 24 బంతుల్లో 45 ప‌రుగులు), అజింక్యా ర‌హానే ( 30 బంతుల్లో 35 ప‌రుగులు) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ 18.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్‌క్ర‌మ్(36 బంతుల్లో 50) హాఫ్ సెంచ‌రీ చేశాడు. అభిషేక్ శ‌ర్మ‌(12 బంతుల్లో 37 ప‌రుగులు), ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 31 ప‌రుగులు) దూకుడుగా ఆడారు.

SRH vs CSK : ధోని బ్యాటింగ్‌కు రాకుండా క‌మిన్స్ కుట్ర? జ‌డేజా ర‌నౌట్ అప్పీల్ వెన‌క్కి..