వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో కివీస్ బ్యాట్స్‌మన్ అదరగొట్టారు. ధాటిగా ఆడుతున్న కివీస్‌ను భారత్ ఫీల్డింగ్‌తో అడ్డుకునందుకు శాయశక్తులా కృషి చేసింది. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ సూపర్ క్యాచ్‌తో మిచెల్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సూపర్ క్యాచ్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్‌గా మారింది. సిక్సు బౌండరీకి వెళ్లబోతున్న బంతిని ఎగిరి అందుకోవడంతో స్టేడియంలో అభిమానులతో పాటు బ్యాట్స్‌మెన్, ఫీల్డర్లు కూడా ఆశ్చర్యపోయారు.
పాండ్యా బౌలింగ్‌లో
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆరంభంలో పరుగులిచ్చినా తర్వాత కట్టడి చేయగలిగింది. పాండ్యా వేస్తున్న 16వ ఓవర్‌లో చివరి బంతిని కివీస్ అరంగేట్ర ఆటగాడు డెరిల్ మిచెల్ అవుట్ సైడ్ ఆఫ్ దిశగా బాదాడు. దాదాపు సిక్సు అని భావించారంతా. కానీ, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న దినేష్ కార్తీక్ అంచనాలను పటాపంచలు చేశాడు. గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోయి సిక్సు బౌండరీ కోల్పోతున్నట్లు భావించిన అతను వెంటనే బంతిని గాల్లోకి విసిరి ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ దాటివచ్చి అందుకున్నాడు.
బంతిని గాల్లోకి విసిరి మళ్లీ అందుకునే గ్యాప్‌లో బ్యాట్‌మన్ ఆ బంతిని పట్టకూడదని కోరుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. బంతి అందుకునే సమయంలో.. విడిచే సమయంలో మళ్లీ అందుకునే సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకలేదని సమీక్షలో స్పష్టం కావడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
What A Catch!. ? DK (Dinesh Karthik) @DineshKarthik ?? #NZvIND pic.twitter.com/WwfKHPVptr
— Shankar (@shanmsd) February 6, 2019