Asia Cup 2025 : ఆసియా కప్‌లో ఈ ఆసక్తికర విషయం తెలుసా..? భార‌త్‌, పాక్ మ్యాచ్‌..

ఆసియాక‌ప్ (Asia Cup 2025) ఫైన‌ల్ మ్యాచ్‌ల్లో భార‌త్, పాక్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సార్లు త‌ల‌ప‌డ్డాయో తెలుసా?

Do you know how many times india and pakistan faced each other in asia cupfinal

Asia Cup 2025 : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ శుభారంభం చేసింది. యూఏఈని చిత్తు చిత్తుగా ఓడించింది. మ‌రోవైపు పాక్ కూడా ఘ‌నంగా బోణీ కొట్టింది. ఒమ‌న్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందింది. ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ సెప్టెంబ‌ర్ 14 (ఆదివారం) జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు కూడా ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆసియాక‌ప్ 1984లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 16 ఎడిష‌న్స్ జ‌రిగాయి. ఇది 17వ ఎడిష‌న్. కాగా.. ఇందులో భార‌త జ‌ట్టు 8 సార్లు (1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023)ఆసియాక‌ప్‌ను ముద్దాడింది.

BCCI : ఆదివార‌మే భార‌త్‌, పాక్ మ్యాచ్‌.. అభిమానుల ఆగ్ర‌హం.. బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

ఈ క్ర‌మంలో ఆసియాక‌ప్‌(Asia Cup 2025)ను ఎక్కువ సార్లు గెలిచిన దేశంగా రికార్డుల‌కు ఎక్కింది. ఇక రెండో స్థానంలో శ్రీలంక ఉంది. లంక జ‌ట్టు 6 సార్లు ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది. ఇక పాక్ విష‌యానికి వ‌స్తే.. రెండు సార్లు (2000, 2012) మాత్ర‌మే ఆసియాక‌ప్‌ను కైవ‌సం చేసుకుంది.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. భార‌త్‌, పాక్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌లేదు. ఇది నిజంగా నిజం. ఈ మెగాటోర్నీ చ‌రిత్ర‌లో భార‌త్‌, పాక్ జ‌ట్లు 19 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 10 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా పాక్ కేవ‌లం 6 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మ‌రో మూడు మ్యాచ్‌లు ర‌ద్దు అయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లు అన్ని కూడా గ్రూప్ స్టేజ్ లేదా సూప‌ర్-4 లేదా సెమీస్‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం.

Sitanshu Kotak : సంజూ శాంస‌న్ ఫుల్ హ్యాపీ.. అందుకే అర్ష్‌దీప్‌ను ఆడించ‌లేదు.. టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌..

ఇదిలా ఉంటే.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్స్‌లో మాత్రం భార‌త్, పాక్ త‌ల‌ప‌డ్డాయి.