Highest team total in ODI World Cups
Highest team total in ODI World Cups : ఇప్పటి వరకు 12 వన్డే ప్రపంచకప్‌లు జరిగాయి. ప్రస్తుతం 13వ ప్రపంచకప్ భారత్ వేదికగా జరుగుతోంది. ఆరంభమై రెండు రోజులు గడిచాయో లేదో అప్పుడే పలు ప్రపంచ రికార్డులు బద్దలు అయ్యాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాప్రికా జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. క్వింటన్ డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డర్ డుసెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2సిక్సర్లు), ఐడెన్ మార్క్రామ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3సిక్సర్లు) శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్లు ఇవే..
శ్రీలంక పై దక్షిణాఫ్రికా 428/5 – 2023 ప్రపంచకప్
అఫ్గానిస్తాన్ పై ఆస్ట్రేలియా 417/6 – 2015 ప్రపంచకప్
బెర్ముడా పై భారత్ 413/5 – 2007 ప్రపంచకప్
ఐర్లాండ్ పై సౌతాఫ్రికా 411/4 – 2015 ప్రపంచకప్
వెస్టిండీస్ పై సౌతాఫ్రికా 408/5 – 2015 ప్రపంచకప్
వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక సార్లు 400+ పరుగులు చేసిన టీమ్‌లు
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు 400+ పరుగులు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా కొనసాగుతోంది. ఇప్పటి వరకు సౌతాఫ్రికా మూడు సార్లు 400+ ఫ్లస్ పరుగులు సాధించింది. ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఆ తరువాత భారత్, ఆస్ట్రేలియాలు ఒక్కసారి 400+ పరుగులు సాధించాయి.
వన్డేల్లో అత్యధిక సార్లు 400+ పరుగులు చేసిన జట్లు ఇవే..
వన్డేల్లో అత్యధిక సార్లు 400+ పరుగులు చేసిన చేసిన రికార్డు దక్షిణాఫ్రికా పేరిటే ఉంది. సపారీలు 8 సార్లు 400+ పరుగులు సాధించారు. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. టీమ్ఇండియా ఇప్పటి వరకు 6 సార్లు 400+ పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ (5), ఆస్ట్రేలియా (2), శ్రీలంక (2)లు ఉన్నాయి.