Aiden Markram : చ‌రిత్ర సృష్టించిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌ ఐడెన్ మార్క్రామ్.. ప్ర‌పంచ‌క‌ప్‌ హిస్టరీలో తొలిసారి

ద‌క్షిణాఫ్రికా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ చ‌రిత్ర సృష్టించాడు. 49 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు.

Aiden Markram : చ‌రిత్ర సృష్టించిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌ ఐడెన్ మార్క్రామ్.. ప్ర‌పంచ‌క‌ప్‌ హిస్టరీలో తొలిసారి

Aiden Markram pic @ 1cc

Updated On : October 7, 2023 / 6:48 PM IST

Aiden Markram : ద‌క్షిణాఫ్రికా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక‌తో జ‌రుగుతున్న మ్యాచులో మార్క్రామ్ 49 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన మొద‌టి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఇంత‌క‌ముందు ఈ రికార్డు ఐర్లాండ్ బ్యాట‌ర్ కెవిన్ ఓబ్రియ‌న్ పేరిట ఉండేది. కెవిన్ ఇంగ్లాండ్‌పై 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో 50 బంతుల్లోనే శ‌త‌కాన్ని చేశాడు. ఇక ఈ మ్యాచులో మార్క్రామ్ మొత్తం 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 106 ప‌రుగులు చేశాడు.

ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు వీరే..

– శ్రీలంక పై ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో 2023 ప్ర‌పంచ‌క‌ప్‌లో
– ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ ఆట‌గాడు కెవిన్ ఓబ్రియన్ 50 బంతుల్లో 2011ప్ర‌పంచ‌క‌ప్‌లో
– శ్రీలంక పై ఆస్ట్రేలియా ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ 51 బంతుల్లో 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో
– వెస్టిండీస్ పై ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఏబీ డివిలియర్స్ 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో

ద‌క్షిణాఫ్రికా త‌రుపున మూడో వేగ‌వంత‌మైన శ‌త‌కం..

ఐడెన్ మార్క్రామ్ ఈ శ‌త‌కంతో మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ద‌క్షిణాఫ్రికా త‌రుపున వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియ‌ర్స్ (31 బంతుల్లో వెస్టిండీస్ పై 2015లో) మొద‌టి స్థానంలో ఉండ‌గా.. మార్క్ బౌచ‌ర్ (44 బంతుల్లో జింబాబ్వే పై 2006లో) రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Also Read: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు వ‌రుస షాక్‌లు.. హార్దిక్ వేలికి గాయం, అనారోగ్యం బారిన గిల్‌..!

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. క్వింట‌న్ డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), వాన్ డ‌ర్ డుసెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2సిక్స‌ర్లు), ఐడెన్ మార్క్రామ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3సిక్స‌ర్లు) లు శ‌త‌కాల‌తో విరుచుకుప‌డ‌డంతో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 428 ప‌రుగులు చేసింది. ప‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇదే అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం.