Vaibhav Sooryavanshi Net Worth : మస్త్ పైసలు ఉన్నయ్..! వైభవ్ ఆస్తుల విలువ ఎంతంటే..

ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. వైభ‌వ్ సూర్య‌వంశీ నిక‌ర ఆస్తి (Vaibhav Sooryavanshi Net Worth) 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా

Do you know Vaibhav Sooryavanshi Net Worth and ipl salary (pic credit@ipl)

Vaibhav Sooryavanshi Net Worth : వైభ‌వ్ సూర్య‌వంశీ.. ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో ఈ పేరు మారుమోగుతోంది. త‌న విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సొంతం చేసుకుంటున్నాడు 15 ఏళ్ల ఈ బుడ్డోడు. బుధ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స‌ర్ల సాయంతో 97 ప‌రుగులు సాధించాడు.

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 45.33 స‌గ‌టు 242.86 స్ట్రైక్‌రేటుతో 680 ప‌రుగులు సాధించాడు. అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. వేలంలో అత‌డిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 1.1 కోట్ల‌కు కొనుగోలు చేయ‌డం ఇప్పుడు చాలా త‌క్కువ మొత్తంలా క‌నిపిస్తోంది.

Riyan Parag : మేం 260 ప‌రుగులు చేయాల్సింది.. కానీ.. రియాన్ ప‌రాగ్ కామెంట్స్‌..

వైభ‌వ్ సూర్య‌వంశీ నిక‌ర ఆస్తి ఎంత‌?

ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. వైభ‌వ్ సూర్య‌వంశీ నిక‌ర ఆస్తి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా. ఎక్కువ‌గా ఐపీఎల్ నుంచే అత‌డు న‌గ‌దును అందుకుంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు అండ‌ర్-19 క్రికెట్ మ్యాచ్ ఫీజుల నుంచి కూడా అత‌డికి ఆదాయం వ‌స్తోంది. ఒక్కో అండ‌ర్‌-19 క్రికెట్ మ్యాచ్ ద్వారా అత‌డు 20 వేలు సంపాదిస్తున్నాడు. ఇత‌ర ఫార్మాట్ల‌లో క్రికెట్ ఆడ‌డం ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.

2026 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో మ్యాచ్ గెలిపించిన ప్రదర్శన చేసినందుకుగాను, సూర్యవంశీ 2026 ఫిబ్రవరిలో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల మీదుగా రూ. 50 లక్షల నగదు బహుమతిని కూడా అందుకున్నాడు.

Pat Cummins : వైభ‌వ్ సూర్య‌వంశీ కానే కాదు.. అదే మా కొంప‌ముంచింది.. లేదంటేనా.. పాట్ క‌మిన్స్ కామెంట్స్

ఇక ఐపీఎల్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా ప‌లు ప్ర‌ముఖ బ్రాండ్‌లు వైభ‌వ్ పై దృష్టి సారిస్తున్నాయి. దీంతో అత‌డి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లు అయ్యాయి. నివేదిక‌ల ప్ర‌కారం జెడ‌స్ వెల్నెస్ బ్రాండ్ అయిన కాంప్లాన్ 2026లో అత‌డిని త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకుంది. కాగా.. ఎండార్స్‌మెంట్ల ద్వారా అత‌డికి ఎంత ఆదాయం వ‌స్తుంది అన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు.