T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సూపర్ 8 ఫార్మాట్ పై ఐసీసీ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటోంది?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) సూపర్-8 దశకు చేరుకునే జట్లు ఏవో తేలిపోయాయి.
- Thota Vamshi Kumar
- Published On : February 20, 2026 / 12:50 PM IST
Do you know Why ICC Is Facing Criticism Over T20 World Cup Super 8 Format
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశకు చేరుకునే జట్లు ఏవో తేలిపోయాయి. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. ఈ 8 జట్లను నాలుగేసి చొప్పున ఐసీసీ రెండు గ్రూప్‌లు విభజించింది. ఇందుకోసం టోర్నీ ఆరంభానికి అన్ని జట్లకు ఐసీసీ ప్రీ సీడింగ్ ఇచ్చింది (టోర్నీ మొదలవ్వకముందే ఏ టీమ్ ఏ గ్రూపులో ఉండాలో ఫిక్స్ చేసింది). ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
ఐసీసీ ప్రీ సీడింగ్ కారణంగా సూపర్-8 గ్రూపుల్లో భారీ అసమతుల్యతకు దారి తీసింది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు గ్రూప్-1లో ఉండగా.. రెండో స్థానంలో నిలిచిన జట్లు అన్ని గ్రూప్-2లో ఉన్నాయి.
Abhishek Sharma : దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. అభిషేక్ శర్మకు ఐడెన్ మార్‌క్రమ్ ముప్పు..! ఇప్పుడెలా?
గ్రూప్ 1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలు ఉండగా.. గ్రూప్ 2లో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లు ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. అంటే.. గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఆయా గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన వాటిలో రెండు జట్లు సెమీస్‌కు చేరకుండానే ఇంటి ముఖం పడతాయి. అదే సమయంలో గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచిన జట్లలో మాత్రం ఓ రెండు జట్లు మాత్రం సెమీస్‌కు చేరుకుంటాయి.
దీనిపైనే నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు ఐసీసీ ప్రీ సీడింగ్ కారణం అని అంటున్నారు. ఉదాహరణకు దక్షిణాఫ్రికా జట్టు తమ గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచినప్పటికి కూడా టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే తక్కువ సీడింగ్ ఇవ్వడంతో గ్రూప్-1లోకి వచ్చింది. అదే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచినప్పటికి కూడా న్యూజిలాండ్ జట్టు అధిక సీడింగ్ కలిగిఉండడంతో వారు గ్రూప్-2లోకి వెళ్లారు.
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సీఎస్‌కేకు భారీ షాక్.. 14.20 కోట్ల స్టార్ ఆటగాడికి గాయం!
ఈ షెడ్యూల్ సహ ఆతిథ్య శ్రీలంకకు ఎలా ప్రతికూలంగా మారుతుందో కూడా విమర్శకులు ఎత్తి చూపారు. ఇప్పటి వరకు శ్రీలంక జట్టు తమ మ్యాచ్‌లను అన్నింటిని స్వదేశంలో ఆడింది. ఒకవేళ ఆ జట్టు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తే అప్పుడు ఆ జట్టు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కొలంబోలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడే అవకాశాన్ని కోల్పోతుంది.
రవాణా, భద్రత, బ్రాడ్‌కాస్టింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికే ఇలా చేశామని ఐసీసీ అంది. అభిమానులకు, మీడియాకు ఇబ్బంది కలగకుండా ఏ జట్టు ఎక్కడ ఆడుతుందో ముందే తెలిస్తే సౌకర్యంగా ఉంటుందని ఐసీసీ చెబుతోంది.
