దేశవాళీ క్రికేట్‌కు BCCI గ్రీన్ సిగ్నల్

  • Publish Date - December 14, 2020 / 08:57 AM IST

Domestic cricket season : దేశవాళీ క్రికెట్‌కు BCCI ఆదివారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ-20 టోర్నమెంట్‌ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్‌ అభిమానులను అలరించనుంది. ముస్తాక్‌ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారో ఫైనల్‌ కానుంది.

ముస్తాక్‌ అలీ టోర్నీతో పాటు దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీ షెడ్యుళ్లను సైతం బీసీసీఐ ప్రకటించనుంది. అయితే కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ నిబంధనలు పాటించాలనే అంశంపై కూడా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి బబుల్ నిబంధనలు ఉంటాయా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.  కరోనా భయాల నేపథ్యంలో బీసీసీఐ ఐసీఎల్‌-2020 ని దుబాయ్‌లో నిర్వహించారు.

దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఐపీఎల్‌లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించడంతో టోర్నీ సక్సెస్‌ అయ్యింది. దీంతో ఐపీఎల్‌ అనంతరం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లింది. అటు తర్వాత వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీ అదే కానుంది.