Donovan Ferreira ruled out of T20 World Cup 2026 Reports
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా.. ఈ మెగాటోర్నీకి ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డోనోవన్ ఫెరీరా టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌లో బౌండరీ ఆపే క్రమంలో ఫెరీరా డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతడి ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. ఆ తరువాత మైదానాన్ని వీడాడు.
Kohli-Rohit : రోహిత్, కోహ్లీ భారత జెర్సీలో మళ్లీ కనిపించేది అప్పుడేనా?
ఇక జట్టు ఇబ్బందుల్లో ఉండడంతో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. అయితే.. ఒక్క బంతిని మాత్రమే ఎదుర్కొన్నాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లాడు. ఇక మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ నిర్వహించారు. అతడి భుజానిక ప్రాక్చర్ అయినట్లుగా తేలింది.
అతడు కోలుకునేందుకు ఐదు నుంచి ఆరు వారాలు పడుతుందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే అతడు సౌతాఫ్రికా టీ20 టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో అతడు టీ20 ప్రపంచకప్‌లో ఆడే సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఫెరీరా టీ20 ప్రపంచకప్ 2026కి దూరం అయితే అది సౌతాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. 2024 నుంచి అతడు ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేటు 177.08గా ఉండడం గమనార్హం.
Shubman Gill : సిరీస్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్.. మా దృష్టి అంతా దానిపైనే.. అందుకే ఇలా..
టీ20 ప్రపంచకప్ 2026 కోసం దక్షిణాఫ్రికా జట్టు ఇదే..
ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), కోర్బిన్ బాష్, డేవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, జేసన్ స్మిత్.