Dushmantha Chameera replaces Atkinson at KKR for IPL 2024
IPL 2024 – KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు గస్ గస్ అట్కిన్సన్ స్థానంలో శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాను తీసుకుంది. గస్ అట్కిన్సన్ గాయపడాడ్డు. దీంతో అతడు ఐపీఎల్ 2024 సీజన్‌కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ క్రమంలో కేకేఆర్ అతడి స్థానంలో చమీరాను తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రూ.50 బేస్‌ప్రైజ్‌తోనే అతడిని సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.
కాగా.. చమీరాకు ఐపీఎల్ కొత్తేమీ కాదు. గతంలో అతడు 2018,2021, 2022 సీజన్లు ఆడాడు. 2018లో రాజస్థాన్ రాయల్స్ తరుపున, 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 12 మ్యాచులు మాత్రమే ఆడిన చమీరా 9 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 43 పరుగులు చేశాడు.
? NEWS ?@KKRiders name Dushmantha Chameera as replacement for Gus Atkinson.
More details ? #TATAIPLhttps://t.co/ioBPp22mGi
— IndianPremierLeague (@IPL) February 19, 2024
32 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ పేసర్ నిలకడగా 140 కి.మీ వేగంతో బంతులను సంధించగలడు. ఇప్పటి వరకు అతడు 52 వన్డేలు, 55 టీ20లు, 12 టెస్టుల్లో శ్రీలంక తరుపున ఆడాడు. వన్డేల్లో 56 వికెట్లు, టీ20ల్లో 55 వికెట్లు, టెస్టుల్లో 32 వికెట్లు తీశాడు.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కేకేఆర్ స్క్వాడ్ ఇదే :
శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, రింకూ సింగ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, నితీష్ రాణా, ఆంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, అనుకూల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్‌కు అన్యాయం జరుగుతోందా? మొన్న బుమ్రా, నేడు జడేజా