Elena Rybakina win Australian Open 2026
Australian Open 2026 : ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా ఎలెనా రిబకినా నిలిచింది. కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ సబలెంకా పై విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా గెలుపొందింది. ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలవడం రిబకినాకు ఇదే తొలిసారి. మొత్తంగా ఆమె కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్ స్లామ్. 2022లో ఆమె వింబుల్డన్ ను గెలుచుకుంది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. 2023 ఫైనల్‌లోనూ వీరిద్దరే ప్రత్యర్థులుగా తలపడ్డారు. అప్పుడు సబలెంకా విజయం సాధించగా తాజాగా రిబకినా గెలుపొంది నాటి ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
Elena & Daphne 💙 pic.twitter.com/LMiPvCDDZO
— #AusOpen (@AustralianOpen) January 31, 2026
ప్రపంచ 5వ ర్యాంక్ క్రీడాకారిణి ఎలెనా రైబకినా ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్‌లో ఓడిపోయింది. అయితే.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు సెట్లు గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్‌ను ముద్దాడింది.