T20 World Cup 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్ ఆడుతోంది.
PIC: @BCCI (X)
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్ ఆడుతోంది. ఈ చివరి లీగ్ గేమ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ “మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బాగుంది. నిన్న రాత్రి ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. కొంచెం తేమ ఉంది. మంచి స్కోర్ చేయాలని ఆశిస్తున్నాం. తర్వాత దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే 2 లేదా 3 రోజుల తర్వాత ఇదే తరహా స్ట్రిప్‌పై మ్యాచ్ ఆడబోతున్నాం. బౌలర్లపై కొంత ఒత్తిడి పెట్టాలనిపించింది.
రెండు మార్పులు చేశాం. కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. వాషింగ్టన్ జట్టులోకి వచ్చాడు” అని అన్నాడు.
భారత జట్టు: ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
నెదర్లాండ్స్ జట్టు: మైఖేల్ లెవిట్, మ్యాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, జాక్ లయన్ కాచెట్, నోవా క్రోస్, రూలఫ్ వాన్ డర్ మెర్వే, లోగన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్
కాగా, ఇప్పటికే భారత్, పాకిస్థాన్ సూపర్-8కి వెళ్లాయి.
గ్రూప్-ఏలో ఇప్పటివరకు ఎవరికెన్ని పాయింట్లు?
| జట్టు | మ్యాచ్‌లు | విజయాలు | పరాజయాలు | నో రిజల్ట్ | పాయింట్లు |
|---|---|---|---|---|---|
| భారత్ (Q) | 3 | 3 | 0 | 0 | 6 |
| పాకిస్తాన్ (Q) | 4 | 3 | 1 | 0 | 6 |
| అమెరికా (E) | 4 | 2 | 2 | 0 | 4 |
| నెదర్లాండ్స్ (E) | 3 | 1 | 2 | 0 | 2 |
| నమీబియా (E) | 4 | 0 | 4 | 0 | 0 |
