ENG vs IND 3rd test Gill and Siraj arent pleased with the balls shape
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి డ్యూక్ బంతుల గురించి చర్చ జరుగుతూనే ఉంది. బంతి ఆకారం త్వరగా మారుతోందని ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తొలి టెస్టులో భారత ఆటగాళ్లు ఎక్కువగా ఈ ఫిర్యాదులు చేయగా రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేశారు. దీంతో మూడో టెస్టులోనైనా నాణ్యమైన బంతులను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వినియోగిస్తుందని అంతా భావించారు.
ఇక మూడో టెస్టు మ్యాచ్‌లోనూ అదే కథ పునరావృతం అవుతోంది. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 91 ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతి తరువాత ఈ ఘటన జరిగింది. కొత్త బంతి తీసుకున్న 10 ఓవర్లకే ఆకృతి కోల్పోయిందని భారత ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేశారు.
Shubman Gill and India unhappy with the umpires. pic.twitter.com/92qt99sRHQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2025
బాల్ ను పరీక్షించిన అంపైర్ ఆ తరువాత బాల్ ఛేంజ్ చేసేందుకు ఒప్పుకున్నారు. మరో బంతిని ఇచ్చారు. అయితే.. మార్చిన బంతి మీదా టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ , పేసర్లు ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరింత పాత బాల్ ఇచ్చారంటూ సిరాజ్ అనడం స్టంప్ మైక్‌లో రికార్డైంది.
91 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 291/7. బ్రైడన్ కార్సే (8), జేమీ స్మిత్ (20)లు క్రీజులో ఉన్నారు.
స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసిన బుమ్రా..
ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ కు టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు.
Curtis Campher : 5 బాల్స్.. 5 వికెట్స్.. వాహ్.. ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావ్..
ఇన్నింగ్స్ 86వ ఓవర్‌ను వేసిన బుమ్రా.. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించిన కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ను (44)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 260 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత 88 ఓవర్‌లోని తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. శతక వీరుడు జోరూట్ (104) ను క్లీన్ బౌల్డ్ చేయగా, ఆ మరుసటి బంతికే క్రిస్ వోక్స్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.