ENG vs IND : తొలి బంతికే ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న జోరూట్.. ద్రవిడ్, స్మిత్ రికార్డులు బ్రేక్..
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Joe Root goes past Rahul Dravid and Steve Smith to raise his 37th Test hundred
లండన్‌లోని లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు 99 పరుగులతో అజేయంగా నిలిచిన రూట్.. రెండో రోజు ఆట ప్రారంభమైన తొలి ఓవర్‌లోని మొదటి బంతికే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 192 బంతుల్లో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో రూట్‌కు ఇది 37వ సెంచరీ కావడం విశేషం.
JOE ROOT HAS JOINT MOST TEST HUNDREDS VS INDIA – 11*. pic.twitter.com/TauaPiyV3U
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2025
ENG vs IND : తొలి రోజు ఆటలో అనూహ్య ఘటన.. బుమ్రానే భయపెట్టాయ్‌గా.. షాకింగ్ వీడియో..
ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా రూట్ రికార్డులకు ఎక్కాడు. అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ లను అధిగమించాడు. ద్రవిడ్, స్మిత్‌లు ఇద్దరూ టెస్టుల్లో చెరో 36 శతకాలు బాదారు.
ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన టెస్టు కెరీర్‌లో 51 సెంచరీలు చేశాడు. ఆ తరువాత జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 51 సెంచరీలు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 45 సెంచరీలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 41 సెంచరీలు
కుమార సంగక్కర (శ్రీలంక) – 38 సెంచరీలు
జోరూట్ (ఇంగ్లాండ్) – 37 * సెంచరీలు
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 36 సెంచరీలు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 36 సెంచరీలు