ENG vs IND : తొలి రోజు ఆటలో అనూహ్య ఘటన.. బుమ్రానే భయపెట్టాయ్‌గా.. షాకింగ్ వీడియో..
తొలి రోజు ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

ENG vs IND 3rd Test A swarm of ladybirds stops play at Lords in day 1
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జోరూట్ (99), బెన్‌స్టోక్స్ (39)లు క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
ఇకపోతే తొలి రోజు ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) భారీ సంఖ్యలో మైదానంలోకి రావడంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురి అయ్యారు. ముఖ్యంగా టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా వీటి కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
A swarm of ladybirds stops play at Lord’s! 🐞😅 pic.twitter.com/49lKhYHXwn
— Sky Sports Cricket (@SkyCricket) July 10, 2025
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 81వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను ఆకాశ్ దీప్ వేశాడు. అతడు నాలుగో బంతిని పూర్తి చేశాక.. లేడీబర్డ్స్ గుంపులు గుంపులుగా మైదానంలోకి వచ్చాయి. బుమ్రా చుట్టూ తిరిగాయి. దీంతో అతడు తన చేతులతో వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశాడు.
బెన్‌స్టోక్స్, జోరూట్ లతో పాటు మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. దీంతో మ్యాచ్‌ను కాసేపు అంపైర్లు నిలిపివేశారు. లేడి బర్డ్స్ కారణంగా మ్యాచ్ నిలిచిపోవడం చాలా అరుదైన ఘటన అని కామెంటేటర్లు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.