ENG vs IND Rishabh Pant hit another ton in the 2nd Test he will surpass Kohli
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక పంత్ సెంచరీ చేస్తే.. ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో సమంగా ఉంటాడు. అదే సమయంలో కోహ్లీని అధిగమిస్తాడు.
ప్రస్తుతం పంత్, కోహ్లీలు ఇద్దరూ కూడా ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో ఐదు శతకాలు బాదారు. ఇక అజారుద్దీన్ ఆరు శతకాలు సాధించాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరు చెరో ఏడు సెంచరీలు చేశారు.
Team India : హ్యాపీ రిటైర్‌మెంట్ జడేజా.. రెండు కేక్‌లు కట్ చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు..
ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ – 7 శతకాలు
రాహుల్ ద్రవిడ్ – 7 శతకాలు
అజారుద్దీన్ – 6 శతకాలు
విరాట్ కోహ్లీ – 5 శతకాలు
రిషబ్ పంత్ – 5 సెంచరీలు
కాగా.. ప్రస్తుతం పంత్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు సెంచరీలు చేశాడు. పంత్ రాణించినప్పటికి తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.