Team India : హ్యాపీ రిటైర్‌మెంట్ జ‌డేజా.. రెండు కేక్‌లు క‌ట్ చేసిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు..

టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 గెలుచుకుని జూన్ 29కి ఏడాది పూరైంది.

Team India : హ్యాపీ రిటైర్‌మెంట్ జ‌డేజా.. రెండు కేక్‌లు క‌ట్ చేసిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు..

Team India celebrates T20 World Cup 2024 final win anniversary

Updated On : June 30, 2025 / 12:05 PM IST

టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 గెలుచుకుని జూన్ 29కి ఏడాది పూరైంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌లో రెండో టెస్టు కోసం బ‌ర్మింగ్‌హామ్‌లో సిద్ధ‌మ‌వుతున్న టీమ్ఇండియా ఆట‌గాళ్లు వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

ఈ వీడియోలో ఆట‌గాళ్లు రెండు కేక్‌ల‌ను క‌ట్ చేశారు. ఓ కేక్ పై టీమ్ఇండియా అని రాసి ఉండ‌గా, రెండో కేక్ పై ఛాంపియ‌న్స్ టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2024 అని రాసి ఉంది. తొలుత అర్ష్‌దీప్ సింగ్‌ను కేక్ క‌ట్ చేయ‌మ‌ని అడిగారు. ఆ త‌రువాత ఆట‌గాళ్లు అంద‌రూ క‌లిసి బుమ్రాను క‌ట్ చేయ‌మ‌ని కోరారు. ఓ కేక్‌ను బుమ్రా క‌ట్ చేయ‌గా మ‌రో కేక్‌ను సిరాజ్ క‌ట్ చేశాడు. ఆ త‌రువాత ఆట‌గాళ్లు అంద‌రూ ఒక‌రికొక‌రి కేట్‌ను తినిపించారు.

MLC 2025 : డుప్లెసిస్ విధ్వంస‌క‌ర శ‌త‌కం.. ముంబై పై సూప‌ర్ కింగ్స్ విజ‌యం..


ఇక పంత్ ఊరుకుంటాడా చెప్పండి.. ర‌వీంద్ర జ‌డేజాను స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. హ్యాపీ రిటైర్‌మెంట్ అని అన్నాడు. వెంట‌నే జ‌డేజా స్పందిస్తూ తాను కేవ‌లం టీ20 ఫార్మాట్ నుంచి మాత్ర‌మే రిటైర్ అయ్యాను అని స్ప‌ష్ట‌త ఇచ్చాడు. జ‌డేజా ఇచ్చిన వివ‌ర‌ణ‌తో అక్క‌డ ఉన్న అంద‌రూ స‌ర‌దాగా న‌వ్వుకున్నారు.

ZIM vs SA : చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌.. ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఫైన‌ల్ మ్యాచ్ గెలిచిన త‌రువాత సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించారు. ఇక ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ టెస్టుల‌కు గుడ్ బై చెప్పారు. కాగా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 గెలిచిన జ‌ట్టులో ఏడుగురు స‌భ్యులు ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్నారు.