ZIM vs SA : చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌.. ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ కేశ‌వ్ మ‌హారాజ్ స‌రికొత్త ఘ‌న‌త‌ను సాధించాడు.

ZIM vs SA : చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌.. ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

Keshav Maharaj 200 test wickets

Updated On : June 30, 2025 / 9:40 AM IST

ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ కేశ‌వ్ మ‌హారాజ్ స‌రికొత్త ఘ‌న‌త‌ను సాధించాడు. ద‌క్షిణాఫ్రికా త‌రుపున టెస్టుల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్న‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో క్రెయిగ్ ఎర్విన్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు.

2016లో వాకా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేసిన మ‌హారాజ్ ఇప్ప‌టి వ‌ర‌కు 59 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కేశ‌వ్ మ‌హారాజ్ త‌రువాత‌ స‌ఫారీల‌ త‌రుపున అత్య‌ధిక టెస్టు వికెట్లు తీసిన స్పిన్న‌ర్లుగా టేఫీల్డ్‌, పాల్‌ ఆడమ్స్ లు ఉన్నారు.

ENG-W vs IND-W : ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీమ్ఇండియాతో మామూలుగా ఉండ‌దుగా..

టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్లు వీరే..
కేశ‌వ్ మ‌హారాజ్ – 202* వికెట్లు
హ్యూ టేఫీల్డ్ – 170 వికెట్లు
పాల్‌ ఆడమ్స్ – 134 వికెట్లు
పాల్‌ హ్యారిస్ – 103 వికెట్లు
నికీ బోయే – 100 వికెట్లు

ఇక ఓవ‌రాల్‌గా ద‌క్షిణాఫ్రికా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా డేల్ స్టెయిన్ ఉన్నాడు. అత‌డు 439 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ తర్వాత షాన్ పొలాక్‌ (421), మ‌కాయా ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్‌ (330), మోర్కెల్‌ (309), కల్లిస్‌ (291) లు ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టానికి 49 ప‌రుగులు చేసింది. టోనీ డి జోర్జీ (22), వియాన్ ముల్డర్ (25) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం స‌ఫారీలు 216 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

ENG-W vs IND-W : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన-షఫాలీ వర్మ జోడీ..

అంత‌క‌ముందు ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 418 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఆ త‌రువాత జింబాబ్వే మొద‌టి ఇన్నింగ్స్‌లో 251 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో స‌ఫారీల‌కు 167 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.