ENG vs SA : దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ పై వన్డేల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన సఫారీ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో (ENG vs SA )జరిగిన తొలి వన్డేలో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మార్‌క్రమ్ కేవలం 23 బంతుల్లోనే అర్థశతకాన్ని నమోదు చేశాడు.
కాగా.. అంతకముందు ఈ రికార్డు ఆల్‌రౌండర్ క్రిస్‌మోరిస్ పేరిట ఉండేది. 2016లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో క్రిస్ మోరిస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో మిల్లర్(33 బంతులు) ఉన్నాడు.
Mohammad Nabi : టీ20 క్రికెట్‌లో నబీ అరుదైన ఘనత.. అఫ్గాన్ చేతిలో పాక్ ఓటమి..
ఇంగ్లాండ్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వీరే..
* ఐడెన్ మార్‌క్రమ్ – 23 బంతుల్లో
* క్రిస్ మోరిస్ – 30 బంతుల్లో
* డేవిడ్ మిల్లర్ – 33 బంతుల్లో
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 24.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో ఓపెనర్ జేమీ స్మిత్ (54; 48 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మిగిలిన వారిలో జోరూట్ (14), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (12), జోస్ బట్లర్ (15)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. వియాన్ ముల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 20.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. సఫారీ బ్యాటర్లలో ఐడెన్ మార్‌క్రమ్ (86; 55 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా ర్యాన్ రికెల్టన్ (31 నాటౌట్) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు.