Danni Wyatt : ప్రేయ‌సిని పెళ్లాడిన ఇంగ్లాండ్ మ‌హిళా స్టార్ క్రికెట‌ర్‌.. ఫోటోలు వైర‌ల్‌

ఇంగ్లాండ్ మ‌హిళా స్టార్ క్రికెట‌ర్ డేనియ‌ల్ వ్యాట్ పెళ్లి చేసుకుంది.

England star Danni Wyatt marries long time partner Georgie Hodge

Danni Wyatt marries Georgie Hodge : ఇంగ్లాండ్ మ‌హిళా స్టార్ క్రికెట‌ర్ డేనియ‌ల్ వ్యాట్ పెళ్లి చేసుకుంది. ఆమె త‌న ప్రియురాలు జార్జి హాడ్జ్‌తో క‌లిసి ఏడు అడుగులు వేసింది. లండ‌న్‌లోని చెల్సియా ఓల్డ్ టౌట్ హాల్‌లో సోమ‌వారం(జూన్ 10న‌) రోజు వీరిద్ద‌రు వివాహ‌బంధంతో ఒక్క‌టి అయ్యారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా తెలియ‌జేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను పంచుకున్నారు. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, నెటిజ‌న్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

33 ఏళ్ల ఆల్‌రౌండ‌ర్ అయిన డేనియ‌ల్ వ్యాట్, జార్జి హాడ్జ్ 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. 2023 ప్రారంభంలో ద‌క్షిణాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థం త‌రువాత వీరిద్ద‌రు త‌మ బంధాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. కాగా.. జార్జి హాడ్జ్ సీసీఏఏ బేస్‌కు చెందిన ఓమ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు హెడ్‌గా ఉంది. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

MS Dhoni : పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో చ‌క్క‌ర్లు కొడుతున్న ధోని..

వ్యాట్ ఇంగ్లాండ్‌ తరఫున ఇప్పటి వరకు 2 టెస్టులు, 110 వన్డేలు, 156 టీ20లు ఆడింది. టెస్టుల్లో 129 ప‌రుగులు, వ‌న్డేల్లో 1907 ప‌రుగులు, టీ20ల్లో 2726 ప‌రుగులు చేసింది. కాగా.. వ‌న్డేలు, టీ20ల్లో రెండేసి సెంచ‌రీలు చేసింది. ఇక బౌలింగ్‌లో వ‌న్డేల్లో 27 వికెట్లు, టీ20ల్లో 46 వికెట్లు ప‌డ‌గొట్టింది.