వార్నర్‌ను మోసగాడు అంటోన్న ఇంగ్లాండ్ మీడియా

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. నిషేదకాలాన్ని పూర్తి చేసుకుని వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధమవుతోన్న సమయంలో వార్నర్‌తో పాటు మరో ఇద్దరు ప్లేయర్లపై ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ అనే సోషల్ మీడియా చౌకబారు ట్వీట్ చేసింది. 

ఆస్ట్రేలియా జెర్సీ ధరించిన వార్నర్ ఫొటోలో ఆస్ట్రేలియాకు బదులుగా చీట్స్(మోసగాళ్లు)అని.. తనతో పాటు మిచెల్ స్టార్క్ , నాథన్ లయన్ శాండ్ పేపర్ రోల్స్ పట్టుకున్నట్లుగా ట్వీట్ చేసింది. అంతేగాక, ఆ ట్వీట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియాకు ట్యాగ్ చేసింది. 

ఏడాది క్రితం జరిగిన బాల్ ట్యాంపరింగ్ కేసులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామరూన్ బాన్‌క్రాఫ్ట్ నిషేదానికి గురైన సంగతి తెలిసిందే.