Ashes 2023 : స్టీవ్ స్మిత్‌ను అవ‌మానించిన ఇంగ్లాండ్ అభిమానులు.. ‘నువ్వు ఏడుస్తుంటే మేము టీవీల్లో చూశాం’..

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లాండ్ అభిమానులు దారుణంగా అవ‌మానించారు. నాలుగో రోజు ఆట‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద స్మిత్ ఫీల్డింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Steve Smith

Steve Smith-Ashes 2023 : భార‌త్‌-పాక్ మ్యాచ్ కు ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతుంటే కూడా అంత‌టి క్రేజ్ ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ రెండు జ‌ట్లు ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌(Ashes)లో త‌ల‌ప‌డుతున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మొద‌టి టెస్టులో ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు నువ్వా నేనా అన్న విధంగా పోటీప‌డుతున్నారు. అయితే.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లాండ్ అభిమానులు దారుణంగా అవ‌మానించారు.

నాలుగో రోజు ఆట‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద స్మిత్ ఫీల్డింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టీవ్‌.. నువ్వు ఏడుస్తుంటే టీవీలో చూశాం అంటూ( We Saw You Crying On Telly) అంటూ పాట రూపంలో స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్క‌సారిగా పాడారు. ఈ పాట‌తో స్టేడియం అంతా దద్ద‌రిల్లిపోయింది. ఆ స‌మ‌యంలో బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఓలీ రాబిన్స‌న్ ఇది వింటూ న‌వ్వుకున్నాడు.

ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా విజ‌య ల‌క్ష్యం 281.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 ఆలౌట్‌

ముక్తకంఠంతో స్టేడియంలోని ప్రేక్ష‌కులు ఇలా పాడుతుంటే బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ మాత్రం పైకి న‌వ్వుతూ ఇంకా పాడండి అన్న‌ట్లు త‌ల ఊపిన‌ప్ప‌టికీ అత‌డి ముఖంలో బాధ క‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా.. 2018లో ఆస్ట్రేలియా జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఆ స‌మ‌యంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్న‌ర్‌లు బాల్ ట్యాంప‌రింగ్‌కు ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే.

ఇది వివాదాస్ప‌దం కావ‌డం స్మిత్‌, వార్న‌ర్‌పై నిషేదం విధించ‌డం వెను వెంట‌నే జ‌రిగిపోయాయి. ఆ త‌రువాత స్మిత్ త‌న త‌ప్పును ఒప్పుకుంటూ మీడియా ముందు వ‌చ్చి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఇంగ్లాండ్ అభిమానులు పాట పాడి అత‌న్ని ఎగ‌తాళి చేశారు. కాగా.. దీనిని నెటీజ‌న్లు త‌ప్పుబ‌డుతున్నారు. ఇలా చేయ‌డం స‌రికాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Suraj Randiv : 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ధోనికి ప్ర‌త్య‌ర్థిగా.. ఐపీఎల్‌లో మ‌హితో క‌లిసి ఆడిన ఓ మాజీ క్రికెట‌ర్ ధీన గాధ‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆట ఆఖ‌రి రోజుకు చేరుకుంది. ఇంగ్లాండ్ గెల‌వాలంటే ఏడు వికెట్లు, ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలంటే 174 ప‌రుగులు కావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు