Italy
EURO 2020 Final : ఏదైనా క్రీడలో ఒక జట్టు పరాజయం చెందితే మరో జట్టు విజయం సాధిస్తుంది. విజయం సాధించగానే..ఆ జట్టు అభిమానులు సంబరపడిపోతుంటారు. ఓడిపోయిన జట్టు ఫ్యాన్స్ మాత్రం నిరాశలో మునిగిపోవడం కామన్. కానీ…కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు. ప్రత్యర్థి జట్ల అభిమానులపై దాడులకు తెగబడుతుంటారు. సరిగ్గా ఇలాగే జరిగింది. యూరో కప్ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ అభిమానులు చెలరేగిపోయారు.
Read More : Al-Qaeda-Human Bombs : యూపీలో మానవ బాంబులతో దాడికి ప్లాన్.. అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
ఎంతలా అంటే..మ్యాచ్ అనంతరం బయటకు వచ్చిన వారిని కుమ్మేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దాడుల నుంచి తప్పించుకోవడానికి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది.
యూరో కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ – ఇటలీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1 స్కోరుతో సమంగా ఉన్నారు. అదనపు సమయం కేటాయించినా..గోల్ సాధించలేకపోయారు.
Read More : Cricket: ‘వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్‌లే ఎక్కువ’
దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్ణయించారు. ఇందులో ఇటలీ విజయం సాధించింది. దీంతో ఇటలీ అభిమానులు కేరింతలు కొట్టారు. అనంతరం బయటకు రాగానే..ఇంగ్లాండ్ అభిమానులు కొంతమంది ఆగ్రహానికి గురవుతూ..వచ్చిన వారిపై దాడులు చేయడం ప్రారంభించారు. ఓ వ్యక్తి పంచ్ లు కొట్టి నానా హంగామా చేశాడు. ఇటలీ జాతీయ జెండాను దుర్వినియోగం చేశారని తెలుస్తోంది. దాడులకు సంబంధించి దృశ్యాలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.