T20 Asia Cup : 6,6,6,6,6,6.. టీ20 ఆసియాకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరో తెలుసా? టీమ్ఇండియా ప్లేయరే..
ఆసియాకప్ టీ20 చరిత్రలో (T20 Asia Cup) వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన రికార్డు టీమ్ఇండియా ప్లేయర్ పేరిటే ఉంది.

Star India player has highest T20 score in Asia Cup history
T20 Asia Cup : ఆసియాకప్ టీ20 చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా? అతడు మరెవరో కాదు.. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీనే.
ఆసియాకప్ 2022లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రోహిత్ శర్మ అందుబాటులో లేని నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే కోహ్లీకి ఇది తొలి సెంచరీ కావడం విశేషం.
IND vs PAK : ఇండియాతో మ్యాచ్‌కి ముందు పాక్ కోచ్ హాట్ కామెంట్స్.. మా గేమ్ ఛేంజర్లు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
1021 రోజుల తరువాత..
ఈ మ్యాచ్‌కు ముందు అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ సెంచరీ చేయక దాదాపు మూడు సంవత్సరాలు అయింది. చివరిసారిగా అతడు 2019 నవంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో శతకం బాదాడు. ఆ తరువాత నుంచి పలుమార్లు అతడు యాభైలు దాటినా మూడు అంకెల స్కోరును మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో అతడి ఫామ్ పై ప్రశ్నలు తలెత్తాయి. కానీ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో వాటి అన్నింటికి కోహ్లీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 122 పరుగులు చేశాడు. ఇది ఆ సమయంలో భారత జట్టు తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అతను రోహిత్ శర్మ 118 పరుగుల రికార్డును అధిగమించాడు.
టీ20 ఆసియాకప్ చరిత్రలో (T20 Asia Cup) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ (భారత్) – 122 నాటౌట్ (2022లో అఫ్గానిస్తాన్ పై)
* బాబర్ హయత్ (హాంగ్‌కాంగ్) – 122 (2016లో ఒమన్ పై)
* రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్) – 84 (2022లో శ్రీలంకపై)
* రోహిత్ శర్మ (భారత్) – 83 (2016లో బంగ్లాదేశ్ పై)