Arjun Tendulkar : నిశ్చితార్థం తరువాత అర్జున్ టెండూల్కర్ దశ తిరిగింది..! ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు.. తొలి బంతికే వికెట్..
నిశ్చాతార్థం తరువాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అదరగొట్టాడు.

Thimmappiah Memorial Tournament Arjun Tendulkar Stuns All With Incredible 5 For
Arjun Tendulkar : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలే అతడు ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌ను నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే అర్జున్,సానియా జంట వివాహబంధంతో ఒక్కటి కానున్నారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమొరియల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో గోవాకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్‌లో గోవాకు అర్జున్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ అనిరుద్ సబాలేను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.
కొద్ది సేపటి తరువాత మరో ఓపెనర్ మహేశ్ మాస్కే (1)ను కూడా అర్జున్ ఔట్ చేశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ మహారాష్ట్రను కోలుకోని దెబ్బ తీశాడు. మొత్తంగా 14 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అర్జున్‌తో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది.
Arjun Tendulkar Took Five Wicket in a Local Tournament after returning To The Cricket after 7 Month. pic.twitter.com/G7RWzxaGhI
— яιşнí. (@BellaDon_3z) September 10, 2025
అనంతరం అభినవ్ తేజ్‌రాణా (77), దర్శన్ మిసల్ (61), మోహిత్ రేడ్కర్(58) అర్ధ శతకాలతో రాణించడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. దీంతో కీలకమైన 197 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక బ్యాటింగ్‌లోనూ అర్జున్ రాణించాడు. 9వ స్థానంలో బరిలోకి దిగిన అతడు 44 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
సానియాతో ఎంగేజ్‌మెంట్ తరువాత అర్జున్ బ్యాట్, బౌలింగ్‌లో సత్తా చాటడంతో నెటిజన్లు తమైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అర్జున్‌కు సానియా లేడి లక్ అని అంటున్నారు.