Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డిన భార‌త మాజీ పేస‌ర్‌.. ’19 ఏళ్ల పిల్లాడిని బ‌స్సు కింద ప‌డేయ‌డం’

హ‌ర్మ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ దొడ్డా గ‌ణేష్ స్పందించాడు.

Ex India Star Criticises Harmanpreet Kaur Comments After Loss against Australia

India vs Australia : ముంబై వేదిక‌గా ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. దీంతో మూడు టీ20 మ్యాచుల సిరీస్‌ను ఆసీస్ 1-1తో స‌మం చేసింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌నతో సత్తా చాటిన‌ప్ప‌టికీ భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ (30), స్మృతి మంధాన (23), రిచా ఘోష్‌(23)లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఆసీస్ 19 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌ల‌లో ఎల్లీస్ పెర్రీ (34 నాటౌట్‌) రాణించింది. దీప్తి శ‌ర్మ రెండు వికెట్లు తీసింది.

Riyan Parag : రియాన్ ప‌రాగ్ మెరుపు శ‌త‌కం.. వెస్టిండీస్ దిగ్గ‌జం వివ్ రిచ‌ర్డ్స్ రికార్డు స‌మం

ఆసీస్ విజ‌యానికి 18 బంతుల్లో 19 ప‌రుగులు.. 

కాగా.. ల‌క్ష్య ఛేద‌న‌లో 17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు చేసింది. ఆసీస్ విజ‌యానికి 18 బంతుల్లో 19 ప‌రుగులు అవ‌స‌రం. 18వ ఓవ‌ర్‌ను పూజా వ‌స్త్రాక‌ర్ అద్భుతంగా వేసి కేవ‌లం నాలుగు ప‌రుగులే ఇచ్చింది. దీంతో ఆసీస్ విజ‌య స‌మీక‌ర‌ణం 12 బంతుల్లో 15 మారింది. 19వ ఓవ‌ర్‌ను యువ బౌల‌ర్ శ్రేయాంక పాటిల్ వేసింది. మొద‌టి బంతికి లిచీఫీల్డ్ ఫోర్ కొట్ట‌గా, రెండో బంతికి రెండు ప‌రుగులు తీసింది. మూడో బంతికి ఫోర్ కొట్టింది. నాలుగో బంతి డాట్ కాగా.. ఐదో బంతిని లిచీఫీల్డ్ సింగిల్ తీయ‌గా ఆరో బంతిని ఎల్లీస్ పెర్రీ సిక్స‌ర్‌గా మ‌లిచి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించింది.

దీనిపై మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ హ‌ర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ..  స్కోర్ బోర్డు పై త‌క్కువ ప‌రుగులే ఉన్న‌ప్ప‌టికీ బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారంది.19వ ఓవ‌ర్ వ‌ర‌కు మ్యాచ్‌ను తీసుకువెళ్ల‌డం సానుకూల థృక్ప‌ధంగా భావిస్తున్న‌ట్లు తెలిపింది. అయితే.. 19వ ఓవ‌ర్‌ను శ్రేయాంక స‌రిగ్గా వేసి ఉంటే మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అభిప్రాయ ప‌డింది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..! క‌ష్టాలు త‌ప్పేలా లేవుగా..!

హ‌ర్మ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ దొడ్డా గ‌ణేష్ స్పందించాడు. శ్రేయాంక‌ను బ‌లిప‌శువును చేయ‌రాద‌ని అర్థం వ‌చ్చేలా 19 ఏళ్ల పిల్ల‌వాడిని బ‌స్సు కింద ప‌డేయం అంటూ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు