Ex-India Star, Who Played 15 Test Matches ( Image Source : Google )
Ajay Jadeja : మాజీ భారత క్రికెట్ జట్టు స్టార్ అజయ్ జడేజాను జామ్ నగర్ తదుపరి జామ్ సాహెబ్‌గా ప్రకటించారు. గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీరంలోని చారిత్రక హలార్ ప్రాంతంలోని నవనగర్ రాజ కుటుంబానికి తదుపరి వారసుడిగా ధృవీకరించారు. అధికారిక ప్రకటన ప్రకారం.. నవనగర్ మహారాజా జామ్ సాహెబ్ ఈ ప్రకటనను ధృవీకరించారు.
ఈ మేరకు ప్రస్తుత రాజు అయిన జాం సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సిన్హ్‌జీ జడేజా తన వారసుడిగా సింహాసాన్ని అధిష్టించనున్నాడని ప్రకటించారు. ఇందుకు జడేజా కూడా అంగీకరించినట్టు మహారాజు తెలిపారు. అయితే, మాజీ క్రికెటర్ అజయ్ జడేజా 1992 నుంచి 2000 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తాను మొత్తం 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు.
జడేజా తన వంశపారంపర్య కుటుంబంలోని ఇద్దరు బంధువులైన కె రంజిత్‌సిన్హ్జీ, కెఎస్ దులీప్‌సిన్హ్జీ పేర్లను కూడా క్రికెట్ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు పెట్టారు. ఆగస్టులో పోలాండ్‌లోని వార్సాలోని నవనగర్ మెమోరియల్‌లోని ఆమ్ సాహెబ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సందర్శించిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది.
తన క్రికెట్ కెరీర్‌తో పాటు, జడేజా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. “ఝలక్ దిఖ్లా జా” అనే డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఇటీవలి కాలంలో క్రికెట్ కామెంటరీతో పాటు నిపుణుడిగా పనిచేశాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా కూడా ఉన్నాడు. 1996 అజయ్ జడేజా కెప్టెన్సీలో బెంగుళూరులో జరిగిన క్రికెట్ ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ జట్టుపై ఆఖరిలో జడేజా కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు.
Read Also : Uppal Stadium : సమస్య పరిష్కారం.. ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు క్లియర్..