Uppal Stadium : స‌మ‌స్య ప‌రిష్కారం.. ఉప్ప‌ల్ స్టేడియం క‌రెంట్ బిల్లు క్లియ‌ర్‌..

ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న క‌రెంట్ బిల్లును హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) క్లియ‌ర్ చేసింది.

Uppal Stadium : స‌మ‌స్య ప‌రిష్కారం.. ఉప్ప‌ల్ స్టేడియం క‌రెంట్ బిల్లు క్లియ‌ర్‌..

HCA Paid Uppal Stadium Current bill to TGSPDCL

Uppal Stadium power bill : ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న క‌రెంట్ బిల్లును హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) క్లియ‌ర్ చేసింది. హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు మంగ‌ళ‌వారం తెలంగాణ స్టేట్ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (టీఎజీస్‌పీడీసీఎల్) సీఎండీ ముషార‌ఫ్ అలీ ఫ‌రూఖీకి కోటి 48 ల‌క్ష‌ల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. ఈ విష‌యాన్ని హెచ్‌సీఏ వెల్ల‌డించింది.

ఉప్ప‌ల్ స్టేడియం క‌రెంట్ బిల్లు సుమారు రూ.1.64 కోట్లు ఉండ‌గా ఐపీఎల్ స‌మ‌యంలో రూ.15ల‌క్ష‌లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని నాలుగైదు వాయిదాల్లో చెల్లించాల‌నే ఆలోచ‌న చేసినా హెచ్‌సీఏ పేరు ప్ర‌తిష్ట‌ల‌ను దృష్టిలో ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఒకే సారి క్లియ‌ర్ చేశారు.
ICC ODI rankings : మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మందాన దూకుడు..

వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి..

ఐపీఎల్ జ‌రుగుతున్న స‌మ‌యంలో విద్యుత్ బిల్లులు పెండింగ్ ఉంద‌నే కార‌ణంగా ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తుండ‌గా క‌రెంట్ క‌ట్ చేసి హైద‌రాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ‌తీసే విధంగా ప్ర‌వ‌ర్తించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎండీ ఫ‌రూఖీని జ‌గ‌న్‌మోహ‌న్‌రావు కోరారు.

2015లో హెచ్‌సీఏకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ మ‌ధ్య జ‌గ‌డం మొద‌లైందని, ఈ స‌మ‌స్యకు త‌మ‌ను బాధ్యుల‌ను చేస్తూ ఐపీఎల్ స‌మ‌యంలో అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించార‌న్నారు. అధికారుల అత్యుత్సాహం వ‌ల్ల క్రికెట‌ర్లు ఇబ్బందులు ప‌డ‌డంతో పాటు జాతీయ స్థాయిలో ఈ విష‌యం సంచ‌ల‌మైంద‌ని, ఇందుకు బాధ్యులైన వారిపై విచార‌ణ జ‌రిపి, శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌క‌లం..!