ICC ODI rankings : మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మందాన దూకుడు..

టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో దూసుకువెలుతోంది.

ICC ODI rankings : మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మందాన దూకుడు..

Smriti Mandhana jumps in ICC ODI rankings after superb hundred vs SA

Updated On : June 18, 2024 / 8:23 PM IST

ICC ODI rankings – Smriti Mandhana : టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో దూసుకువెలుతోంది. ఐసీసీ విడుద‌ల చేసిన మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంక్సింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు ఎగ‌బాకి మూడో స్థానానికి చేరుకుంది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో శ‌త‌కంతో రాణించ‌డం క‌లిసి వ‌చ్చింది. ప్ర‌స్తుతం మందాన ఖాతాలో 715 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా.. ఐసీసీ వ‌న్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో చోటు ద‌క్కించుకున్న ఏకైక ఆసియా క్రికెట‌ర్ మందాన కావ‌డం గ‌మ‌నార్హం.

ఇంగ్లాండ్ బ్యాట‌ర్ న‌టాలీ స్కివ‌ర్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చ‌మారీ ఆట‌ప‌ట్టు రెండో స్థానంలో కొన‌సాగుతోంది. భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ మూడు స్థానాలు ఎగ‌బాకి 20 ర్యాంకుకు చేరుకుంది. పూజా వ‌స్త్రాక‌ర్ మూడు స్థానాలు ఎగ‌బాకి 38 ర్యాంక్‌కు చేరుకుంది. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 11వ స్థానంలో ఉంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌క‌లం..!

ఇదిలా ఉంటే.. మహిళల జట్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా వన్డేల్లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో ఉంది.

మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంకింగ్స్ జాబితా..
1.న‌టాలీ స్కివ‌ర్ (ఇంగ్లాండ్‌) – 772 రేటింగ్ పాయింట్లు
2. చ‌మారీ ఆట‌ప‌ట్టు (శ్రీలంక‌) – 768 రేటింగ్ పాయింట్లు
3.స్మృతి మంధాన (భార‌త్‌) – 715 రేటింగ్ పాయింట్లు
4.బెత్ మూనీ (ఆస్ట్రేలియా) – 704 రేటింగ్ పాయింట్లు
5.లారా వోల్వార్డ్ (ద‌క్షిణాఫ్రికా) – 702 రేటింగ్ పాయింట్లు